మండల పరిషత్ ఉప పోరు
ABN, Publish Date - May 20 , 2025 | 12:45 AM
అత్తిలి మండల పరిషత్ అధ్యక్షుడిగా కూటమి తరపున నక్కా సూర్యారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కొనకళ్ళ విజయనిర్మల ఎన్నికయ్యారు.
అత్తిలి, యలమంచిలిలో ప్రశాంతంగా ఎన్నిక
అత్తిలి ఎంపీపీ పీఠం కూటమి కైవసం
అత్తిలి, మే 19 (ఆంధ్రజ్యోతి): అత్తిలి మండల పరిషత్ అధ్యక్షుడిగా కూటమి తరపున నక్కా సూర్యారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కొనకళ్ళ విజయనిర్మల ఎన్నికయ్యారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిమిత్తం మండల పరిషత్ ప్రత్యేక సమావేశం ఎన్నికల అధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. మండలంలో 20 మంది ఎంపీటీ సీలు ఉండగా ఒక ఎంపీటీసీ అనర్హురాలు కావడంతో 19 మంది ఎన్నికైన ఎంపీటీసీలు, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీవో కతీబ్ కౌసర్ బానో సమావేశంలో పాల్గొన్నారు.
ఎంపీపీగా నక్కా సూర్యారావు పోటీలో ఉండగా ఆయనకు 11 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి రాంభ సుజాతకు 8 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా కొనకళ్ళ విజయనిర్మల ఎన్నికయ్యారు. ఆమెకు 11 ఓట్లు రాగా, వైసీపీ తరపున పోటీ చేసిన అద్దంకి శ్రీనుకు 8 ఓట్లు వచ్చాయి. ఎంపీపీ, ఉపా ధ్యక్ష పదవులు రెండు కూటమి పార్టీలు బలపర్చిన అభ్యర్థులే గెలిచారు. వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అత్తిలి మండల పరిషత్ అధ్యక్షుడొగా గతంలో నక్కా సూర్యారావు ఎన్నిక కాగా ఎన్నికల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరారు. ఇప్పటి వర కూ ఇన్‌చార్జి ఎంపీపీగా మండల ఉపాధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు వ్యవహరించారు. మండల పరిషత్ ఎన్నిక గతంలో నిర్వహించడానికి ప్రయత్నించగా ఎన్నిక కార్యక్రమానికి ఎంపీటీసీలు హాజరుకాకపోవడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, కోఆప్షన్ సభ్యులు అభినందించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పార్టీ జెండాలతో ఎంపీపీ కార్యాలయం వద్ద మోహరించారు. కూటమి అభ్యర్ధి గెలిచారనే సమాచారం తెలపడంతో పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు.
యలమంచిలి ఎంపీపీగా ధనలక్ష్మి
యలమంచిలి, మే 19 (ఆంధ్రజ్యోతి): యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా వైసీపీకి చెందిన ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యురాలు ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాల యంలో డ్వామా పీడీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి కేసీహెచ్.అప్పారావు ఎంపీపీ ఎన్నికను సోమవారం నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి ఇనుకొండ ధనలక్ష్మి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి ధనలక్ష్మికి ధ్రువీకరణ పత్రం అందజే శారు. అనంతరం ఎంపీపీగా ఎన్నికైన ధనలక్ష్మితో ప్రిసైడింగ్ అధికారి ప్ర మాణస్వీకారం చేయించారు. ఎన్నికకు వైసీపీకి చెందిన 12మంది ఎంపీ టీసీ సభ్యులు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ హాజరయ్యారు. ఎన్డీఏ కూటమికి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు, ఇటీవల టీడీపీలో చేరిన మేడపా డు ఎంపీటీసీ సభ్యురాలు ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఎంపీపీగా ఎన్నికైన ఇనుకొండ ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. తనను ఎంపీపీగా ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులకు, సహకరించిన వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - May 20 , 2025 | 12:45 AM