ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్టీని బలోపేతం చేయండి

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:04 AM

జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి పార్టీ నాయకత్వం సమన్వయంతో ముందుకు వెళ్ళాలని పీసీసీ అఽధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న షర్మిల.. పక్కన డీసీసీ అధ్యక్షుడు హరికుమార్‌ రాజు, మాజీ మంత్రి బాపిరాజు

మండల, గ్రామస్థాయిల్లో కమిటీలు వేయండి

కాంగ్రెస్‌ పార్టీ ‘పశ్చిమ’ సమావేశంలో

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

భీమవరం టౌన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి పార్టీ నాయకత్వం సమన్వయంతో ముందుకు వెళ్ళాలని పీసీసీ అఽధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా భీమవరంలోని ఆనందా ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం ఎలా చెయ్యాలి ? నాయకత్వంపైనా సమాచారాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు అందరికి కలుపుకుని ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని పట్టణ, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యాలి. ప్రజల పక్షాన పోరాడాలి అని అన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ రాష్ట్రానికి కాంగ్రె స్‌ పార్టీ అవసరం ఎంతో ఉందన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చెయ్యలేకపోయిందని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తే ఒక్కరూ ప్రశ్నించడం లేదన్నారు. విభజన హామీలను అమలు చేసే సత్తా ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరికుమార్‌రాజు, కేబీఆర్‌ నాయుడు, ఏడు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:04 AM