ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహా వేడుక

ABN, Publish Date - May 26 , 2025 | 12:21 AM

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఉమ్మడి పశ్చిమ నుంచి పెద్దఎత్తున తరలి వెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు సకల సన్నాహాల్లో ఉన్నారు.

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కార్యాలయం నుంచి కడపకు తరలిస్తున్న మామిడికాయల లోడు

కడప దిశగా పసుపు దండు

ఉమ్మడి జిల్లా నుంచి ఆవకాయ

ప్రతినిధులకు ఏలూరు ఎంపీ ప్రత్యేక వసతి

ఏర్పాట్లలో నిమ్మల, కొలుసు, చింతమనేని బిజీ

పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్న జిల్లా అధ్యక్షులు మంతెన, గన్ని

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఉమ్మడి పశ్చిమ నుంచి పెద్దఎత్తున తరలి వెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు సకల సన్నాహాల్లో ఉన్నారు. తణుకు, నూజివీడులో జిల్లా స్థాయి మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో కడపలో జరిగే మహానాడుకు హాజరుకావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మహానాడు ప్రతినిధులుగా గుర్తించిన వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ నెల 29న కడపలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఉమ్మడి పశ్చిమ నుంచి ఏర్పాట్లలో నేతలు తలమునకలై ఉన్నారు.

ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో నిర్వహించాలనే అధిష్ఠానం నిర్ణయంతో కేడర్‌లో ఉత్సాహం ఉరకలేసింది. రాయలసీమ తమ కంచుకోటగా వైసీపీ భావిస్తున్న కడప లో పసుపు జెండా సత్తా చూపాలని భావించారు. ఆ దిశ గా జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ మినీ మహానాడు సమావేశాలు సక్సెస్‌ అయ్యాయి. పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ సత్తా మరోసారి బహిర్గతం చేసే దిశగానే మినీ మహానాడు పర్వం సాగింది. నియోజకవర్గ నేతలు తమ మనస్సులో మాటలను వ్యక్తీ కరించేందుకు దీనినే వేదికగా తీసుకున్నారు. నామినేటెడ్‌ పదవుల నుంచి కార్యకర్తలకు గుర్తింపు తీసుకువచ్చే వరకు ప్రధానంగా ప్రస్తావించారు. కార్యకర్తలకు కట్టుబడి ఉన్నామ ని దీంట్లో ఎలాంటి సందేహం లేనేలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ నేతలంతా ఒకేచోట కలవడం, వివిధ అంశాలను చర్చించడానికి మినీ మహానాడు వేదికలు పక్కాగా కలిసి వచ్చాయి. ఎక్కడ గీత దాటకుండానే ఏడాది సమయంలో పార్టీ పరంగా ప్రజల్లో ఉన్న మనోభావాలను కూడా నేతలు పరస్పరం చర్చించుకోవడానికి దోహదపడ్డాయి. దీంతో పాటు జిల్లా స్థాయి మహానాడులో చేసిన తీర్మానాలు పార్టీ విధానాలకు అద్దం పట్టేలా ఉన్నాయి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని, లోకేశ్‌ పార్టీకి చేసిన సేవ లను పూర్తిగా గుర్తించాలని, కొల్లేరు సమస్యల పరిష్కారా నికి మరింత చొరవ తీసుకోవాలని, ఆక్వారంగంలో ఒడిదు డుకులు తొలగించి రైతులకు అండగా నిలవాలని, పారిశ్రా మికీకరణ దిశగా చర్యలు తీసుకొని ఉద్యోగావకాశాలు కల్పిం చాలని, నూజివీడు, దెందులూరుల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు ఏర్పాటు చేయాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం నిత్యం కష్టపడే కార్యకర్తల సేవలను గుర్తించాలని తీర్మానాలను ఆమోదించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అదే అంశాన్ని తీర్మానంగా చేసి ఆమోదించడం తెలుగుదేశం విధానం. ఇరు జిల్లాల అధ్యక్షులు మంతెన రామరాజు, గన్ని వీరాంజనేయులు మహానాడు విజయ వంతం చేయడంలో తలమునకలుగా ఉన్నారు.

మహానాడు ఏర్పాట్లలో నేతలు బిజీ బిజీ..

మహానాడు ఏర్పాట్లలో జిల్లాల వారీగా కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. మహానాడు పర్యవేక్షణ ఏర్పాట్ల ను మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఆయన మూడు రోజలుగా కడపలోనే మకాం వేసి రోజు వారీ పనులను సమీక్షిస్తున్నారు. పార్టీ నిర్దేశించినట్లు నిర్వహణ ఏర్పాట్లపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకో వైపు ఎమ్మెల్యేలు చింతమనేని, ఆరిమిల్లి రాధాకృష్ణకు మరి కొన్ని బాధ్యతలు అప్పగించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారఽఽథి, మాజీ మంత్రి పీతల సుజాత తమ కు అప్పగించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రతి నియోజక వర్గం నుంచి రెండు, మూడు వందల మందికి తగ్గకుండా ప్రతినిధుల సభకు హాజరవుతున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించిన దాదాపు 2వేల మంది ప్రతినిధులకు కడప జిల్లా మైదుకూరులో వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌ చొరవ తీసుకుని ఈ ఏర్పా ట్లను చేస్తున్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాం జనేయులుకు ప్రత్యేకంగా ఒక నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడంతో ఆయన నెల్లూరులో మకాం వేశారు.

సీమకు గోదావరి ఆవకాయ

మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మన ప్రాంత ఆవ కాయ అంటే అందరూ చెవులు కోసుకుంటారు. మామిడి సీజన్‌ కావడంతో మామిడికాయలు, ఆవకాయ పట్టేందు కు అవసరమైన సరుకులు, నిష్ణాతులైన వారితో సహా దెందు లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కడపకు బయల్దే రారు. మహానాడుకు హాజరయ్యే వారందరికీ ఆవకాయ రుచి చూపించేందుకు వందల సంఖ్యలో మామిడికాయల లోడుతో వాహనాలు ఆదివారం కడప బాట పట్టాయి. మొదటి నుంచి కేడర్‌కు వండి, వడ్డిం చడంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ది అందెవేసిన చేయి. ఈ సారి మహానాడులో సైతం వేలమంది గుర్తు పెట్టుకు నేలా అసలు సిసలైన ఆంధ్రా ఆవకాయ బాధ్యతను ప్రభాకర్‌ స్వీకరించారు. దీంతో పాటు మిగతా ప్రాంతాల నుంచి కడపకు వెళ్లే వారిలో అత్యధికులు తమతో పూతరేకులు తీసుకెళ్లాలని ఉత్సాహంగా ఉన్నారు. తమ ప్రతిపాదనను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే పూతరేకులు రుచి చూపించడానికి సిద్ధ పడుతున్నారు.

Updated Date - May 26 , 2025 | 12:21 AM