ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త పట్టిసీమలో మద్యం లోడు వాహనం బోల్తా

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:08 AM

మండలంలోని కొత్త పట్టిసీమ వద్ద బుధవారం మద్యం లోడుతో వెళుతున్న మినీ వ్యాన్‌ బోల్తాపడింది.

మద్యం లోడుతో బోల్తాపడిన వాహనం

పగిలిన మద్యం సీసాలు, కేస్‌లు

పోలవరం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్త పట్టిసీమ వద్ద బుధవారం మద్యం లోడుతో వెళుతున్న మినీ వ్యాన్‌ బోల్తాపడింది. కొవ్వూరు వైపు నుంచి పోలవరం మద్యం లోడుతో వస్తున్న వాహనం పట్టిసీమ ఇసుక ర్యాంపు సమీపంలో మలుపు వద్ద బోల్తాపడడంతో మద్యం సీసాల బాక్సులు నేలపాల య్యాయి. కొన్ని మద్యం సీసాలు, బీరు కేసులు పగిలి పోయాయి. మద్యం షాపు నిర్వహకులు సంఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన సీసాలను మరో వాహనంలో తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, రూ.7 లక్షల విలువైన మద్యం లోడులో 30శాతం నష్టపోయినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఇదే మలుపు వద్ద కారు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదాలు జరిగే ప్రాంతమని పోలీసులు హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు ఏర్పాటు చేశారు. అవి పోవడంతో మళ్లీ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated Date - Apr 17 , 2025 | 12:08 AM