రాములోరి స్థలంపై కన్ను..
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:47 AM
చాట్రాయి శ్రీరామచంద్రస్వామి ఆలయానికి చెందిన రూ.కోటి విలువైన స్థలాన్ని కొందరు కైంకర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని నిరోధించి దేవుడి ఆస్తిని కాపాడాలని కోరుతూ తహసీల్దార్ ఈశ్వరరావుకు ఆయల కమిటీ సభ్యులు, గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.
చాట్రాయిలోరూ.కోటి విలువైన స్థలం కైంకర్యానికి ప్రయత్నం
తహసీల్దార్‌కు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఫిర్యాదు
చాట్రాయి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): చాట్రాయి శ్రీరామచంద్రస్వామి ఆలయానికి చెందిన రూ.కోటి విలువైన స్థలాన్ని కొందరు కైంకర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని నిరోధించి దేవుడి ఆస్తిని కాపాడాలని కోరుతూ తహసీల్దార్ ఈశ్వరరావుకు ఆయల కమిటీ సభ్యులు, గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. 60 ఏళ్ల క్రితం ఓదాత సర్వే నెంబరు 264లో ఆలయ పూజారి నివా సం కోసం ఐదు సెంట్లు స్థలాన్ని విరాళంగా ఇచ్చారని, చాట్రాయి సెంటర్‌లో ఉన్న ఈ స్థలం ప్రస్తుతం సుమారు రూ.కోటి విలువ పలుకుతోందన్నారు. ఈ స్థలాన్ని ఇదే గ్రామానికి చెందిన కొంతమంది కాజేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం గ్రామ కంఠంగా నమోదై ఉన్నందున ఎన్‌వోసీ ఇవ్వవద్దని కోరారు. తహసీల్దార్ స్పందిస్తూ ఆలయానికి చెందిన స్థలం అన్యా క్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ స్థలంలో ‘ఇది శ్రీరామచంద్రస్వామి ఆలయానికి చెందినది, అతిక్రమిస్తే శిక్షార్హులు’ అని బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ అంబటి సత్యనారాయణ, బండి శ్రీని వాసరెడ్డి, కమ్ముల కొండలరావు, నెల్లూరి శ్రీనివాసరావు, పసుపులేటి సత్యనారాయణ, శ్రీరాము ల సత్యనారాయణ, తోటకూర వెంకటేశ్వరరావు, సవిరి దుర్గాప్రసాద్, శివశంకర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 12:47 AM