ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొల్లేరు కాలుష్యంపై మీరేం చేశారు ?

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:24 AM

కొల్లేరులో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ రెండు రోజుల వ్యవధిలోనే క్షేత్రస్థాయి నుంచి వినతుల వరకు ఆసాంతం గమనించింది. కొల్లేరు ఆపరేషన్‌కు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వివిధ శాఖల నుంచి ఆరా తీసింది. రోడ్ల నిర్వహణ, ఏర్పాట్లపై జరిగిం దేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిం చింది.

కేంద్ర కమిటీ సభ్యులకు కొల్లేరు ప్రజల సమస్యలు తెలుపుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని.. చిత్రంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి తదితరులు

చేపల పెంపకం, వినియోగంపై తేడాలున్నాయా..

ఏలూరులో వ్యర్థాలను ఎంత మేరకు శుద్ధి చేస్తున్నారు

కొల్లేరులో పరిశీలించి, ఆరా తీసిన సాధికార కమిటీ

అన్ని కోణాల్లో చూసి న్యాయం చేయండి : ఎమ్మెల్యేలు

కొల్లేరులో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ రెండు రోజుల వ్యవధిలోనే క్షేత్రస్థాయి నుంచి వినతుల వరకు ఆసాంతం గమనించింది. కొల్లేరు ఆపరేషన్‌కు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వివిధ శాఖల నుంచి ఆరా తీసింది. రోడ్ల నిర్వహణ, ఏర్పాట్లపై జరిగిం దేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిం చింది. సాధికార కమిటీ కార్యదర్శి జేఆర్‌ భట్‌, జి.భానుమతి, సునీల్‌ లిమాయే, చంద్రశేఖర్‌ గోయల్‌, ప్రకాశ్‌చంద్రభట్‌ నలుగురితో కూడిన బృందం మంగళవారం కైకలూరులో పర్యటిం చగా, బుధవారం ఏలూరు కేంద్రంగా ఉంగు టూరు, దెందులూరు, ఏలూరు ప్రాంతా వారి నుంచి వినతులను స్వీకరించింది. సమాం తరంగా పర్యావరణం, కాలుష్యం, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమీక్షించింది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉప్పుటేరులో కలిసే ఇరిగేషన్‌ డ్రెయిన్లు, డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోకి వచ్చే కాలుష్యం నివారణకు ఏ చర్యలు తీసు కున్నారని కమిటీ ప్రశ్నించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చేరే కాలుష్యం నివారణకు వీలుగా నీటి శుద్ధి జరుగుతుందా ? డ్రెయిన్లు డీ సిల్టింగ్‌ చేస్తున్నారా.. లేదా.. దీనిపై సమగ్ర నివేదికను తమకు అందించాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈ నాగార్జునరావును కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌ గోయల్‌ ఆదేశించారు. ఏలూరు నగరం నుంచి కొల్లేరులో కలుషిత జలాలు ఏ మేరకు ఉంటున్నాయి ? వీటిని శుద్ధి చేసే అవకాశం ఉందా, లేదా అంటూ కమిషనర్‌ భాను ప్రతాప్‌ను ప్రశ్నించారు. నగరంలో 32 ఎంఎల్‌డీ వ్యర్థాలు విడుదలవుతాయని, పారిశుధ్య వ్యర్థాలు 7 ఎంఎల్‌డీగా ఉందని, 5 ఎంఎల్‌డీ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్‌ ప్రస్తుతం అందుబాటులో ఉందని కమిషనర్‌ వివరించారు. ఈ తరహా వ్యర్థాలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతున్నాయని, వీటిని మళ్లించేందుకు అవకాశం ఉందా, లేదా అంటూ కమిటీ ఆరా తీసింది.

నివేదికలు ఇవ్వాల్సిందే

కొల్లేరు అంతర్భాగంలో తాజా పరిస్థితులను గమనించా మని, అయితే శాఖల వారీగా నివేదికలను కమిటీకి సకాలంలో ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. సరస్సు పరిధిలో పర్యావరణం, కాలుష్య పరిస్థితులు, చేపల పెంప కానికి వినియోగించే నీరు, తాగునీటి కాలుష్యం, పరిశ్రమల ద్వారా కొల్లేరులోకి వెళ్లే వ్యర్థాల కాలుష్యంపై సమగ్ర నివేది కను తమకు పంపాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావును కమిటీ ఆదేశించింది. తాగునీరు, భూగర్భ జలాలు, డ్రెయిన్ల కాలుష్య కారకాలపై ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తూనే ఉన్నామని ఈఈ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

కొల్లేరులో చేపల ప్రస్తావన

సరస్సులో ఎన్ని రకాల చేపలు పెంచుతున్నారు ? కాలు ష్య నీటిలో ఉత్పత్తి అయ్యే చేపల వినియోగంతో తలెత్తుతు న్న అనారోగ్య సమస్యలేమిటి? చేపల పెంపకానికి విని యోగించే రసాయనిక ఎరువులు, పురుగుల మందుల ద్వారా సరస్సు కలుషితం అవుతుందా ? దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది.

హక్కులు కాపాడాలి : చింతమనేని

కొల్లేరు అంశంలో ఒక పార్శ్వమే కాకుండా ఇంకోవైపు చూడాలని బుధవారం ప్రజా ప్రతినిధులు, రైతులు, మహిళలు, పర్యావరణ ప్రేమికులు సాధికార కమిటీ దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. కలెక్టరేట్‌లో గోదావరి సమావేశ మందిరంలో గంటన్నరకు పైగానే వినతులు అందుకున్నా రు. అభయారణ్యం పరిధిలో 14 వేల ఎకరాల భూమిదారు లు, మరో 20 వేల డి–ఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కాంటూరు పరిధి తగ్గిస్తామన్నా ఇప్పటికీ నెరవేరలేదని, డ్రెయిన్ల డీ సిల్టింగ్‌ చేయని కార ణంగా కొల్లేరు ప్రాంతం వరద సమయంలో ముంపునకు గురవుతోందని, డ్రెయిన్ల మరమ్మతులకు రూ.3 కోట్లు మంజూరు చేస్తే, అభయారణ్య పరిధిలోకి వస్తుందని పనులే చేపట్టని విషయాన్ని ఆయన కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. వన్యప్రాణి అభయారణ్యం అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోలేదని, కొల్లేరు ఆపరేషన్‌లో భూములు కోల్పో యిన వారికి న్యాయం చేయాలని ఆయన కోరారు.

కమిటీ తిరుగు ప్రయాణం

జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించిన కేంద్ర సాధికార కమిటీ బృందం అన్ని అంశాలను సాధ్యమైనంత మేర స్పృశించే ప్రయత్నం చేసింది. రెండో రోజు బుధవారం జరిగిన సమీక్షలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ అజయ్‌కుమార్‌ నాయక్‌, ఎస్పీ కిశోర్‌, డీఎఫ్‌వోలు శుభం, విజయ, ఆర్డీవో అంబరీశ్‌ పాల్గొన్నా రు. సాధికార కమిటీ సభ్యులను సాగ నంపుతూ వారందరిని కలెక్టర్‌ సత్కరించారు.

కొల్లేరు అభివృద్ధి బోర్డు కావాలి : కామినేని

కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలన్నారు.

కొల్లేరులో పర్యావరణ, పక్షులను కాపాడేది రైతులేనని, కొల్లేరు అభయారణ్యం నోటిఫికేషన్‌ విడుదల చట్టంగా రూపొందించే సమయంలో ఆయా పరిణామాలపై ఎటువంటి అవగాహన లేదని, ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితి ఎదురైందని, రాష్ట్ర ఫిష్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు అభిప్రాయపడ్డారు.

కొల్లేరులో 122 గ్రామాలుంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు అత్యధికులని, వీరిలో అభయారణ్యం చట్టంపై అవగాహన లేదని ఆ మేరకు ఇప్పటి వరకు కల్పించలేకపోయారని శివాజీ అన్నారు.

జిరాయితీ, డి–ఫారం భూములను కొల్లేరు వాసులకు అందించాలని ఆ ప్రాంత నేత సైదు సత్యనారాయణ వేడుకన్నారు.

కొల్లేరు ప్రజల సమస్యలపై కమిటీ సభ్యులకు జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ వినతి పత్రం సమర్పించారు. కాంటూరు కుదింపు, జిరాయితీ భూములు, డి–ఫారం భూముల సమస్యను ప్రస్తావించారు. కొల్లేరు సరస్సులోకి కలుస్తున్న 67 ప్రధాన కాలువలకు డీసిల్టింగ్‌ (మట్టి తొలగింపు), పునరుద్ధరణ పనులకు కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరమని పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు చేతులు జోడించి తమను ఆదుకొండంటూ విజ్ఞప్తి చేయడంతో కమిటీ సభ్యులు ఆశ్చర్యచకితులయ్యారు.

Updated Date - Jun 19 , 2025 | 12:24 AM