కొల్లేరు.. కట్టుబాట్ల వివాదం
ABN, Publish Date - May 19 , 2025 | 12:01 AM
కొల్లేరు గ్రామా ల్లో కట్టుబాట్లు మధ్య పెద్దలు నిర్వహించే పంచాయతీల్లో వివాదం చోటు చేసుకుని గ్రామ సర్పంచ్‌తో పాటు మరో మహిళపై దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్నది.
సర్పంచ్‌పై దాడి.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
కైకలూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): కొల్లేరు గ్రామా ల్లో కట్టుబాట్లు మధ్య పెద్దలు నిర్వహించే పంచాయతీల్లో వివాదం చోటు చేసుకుని గ్రామ సర్పంచ్‌తో పాటు మరో మహిళపై దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొంతకాలం క్రితం కైకలూరు మండలం చటాకాయ్ గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారని కొంతమందిపై గ్రామపెద్దలు, ప్రజలు దాడి చేశారు. అప్పటి నుంచి గ్రామంలో విభేదాలు ఏర్పడటంతో గ్రామసర్పంచ్‌గా ఉన్న ఘంటశాల శేషారావు గ్రామ కట్టుబాట్లు మధ్య జరిగే కార్యక్రమా లకు కానీ ఇతర వాటికి హాజరుకావడం లేదు. కొల్లేరులో సొసైటీ భూముల్లో చేపల సాగు చేసి వచ్చిన ఆదాయాన్ని గ్రామస్థులంతా పంచుకుంటారు. అయితే క్షుద్రపూజలకు పాల్పడిన కుటుంబాలకు ఈ చెరువుల్లో వాటాలు ఇవ్వకపోవడంతో వారు అటవీ శాఖ ఉన్న తాధికారులకు అక్రమసాగు జరుగుతున్న ట్లు ఫిర్యాదు చేసి చెరువులను ధ్వంసం చేయాలని కోరుతున్నారు. కొద్దిరోజులుగా ఈ వాటాల వివాదం నెలకొనడంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆది
వారం గ్రామపెద్దలు కట్టుబాట్లు మధ్య గ్రామం లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమా వేశంలో ఇరువర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటుచేసుకున్నది. కొంతమంది మహిళలు ఆకస్మికంగా సర్పంచ్ శేషారావుపై, అతని వర్గీయులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జయమంగళ రామసీత అడ్డుకుంది. ఈ తరుణంలో ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన రామ సీత పురుగుమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆమెను హుటాహుటిన కైకలూరు ప్రభుత్వాసుపత్రికి ఆమె బంధువులు తరలిం చారు. ఈ వివాదం జరుగుతుందని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు వీడియోలు తీస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వీడియోలు తీస్తే సహించేది లేదంటూ గ్రామం నుంచి వెళ్లిపొమ్మని బలవంతంగా పంపించి వేశారు. ఈ సంఘటన తెలుసుకున్న కైకలూరు రూరల్ ఎస్‌ఐ వి.రాంబాబు తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.
ఇరువర్గాల ఫిర్యాదులు
జయమంగళ రామసీత తనపై గ్రామానికి చెందిన బలే శేషారత్నం, మరో 13మంది దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే బలే శేషారత్నం తనపై ఘంటసాల పార్థసారథి మరో 18మంది దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - May 19 , 2025 | 12:01 AM