కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:50 AM
రైతుల నుంచి ప్రభుత్వమే కోకో గింజలు రూ.500 ధరకు కొనుగోలు చేయాలని ఏపీ కోకో రైతు సంఘం డిమాండ్ చేసింది.
ఏలూరు కార్పొరేషన్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ప్రభుత్వమే కోకో గింజలు రూ.500 ధరకు కొనుగోలు చేయాలని ఏపీ కోకో రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తిరిగి ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థానిక అన్నేభవనంలో కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన గురువారం సమావేశాన్ని నిర్వహించారు. కోకో రైతుల సమస్యలసౌ చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ. వెంక టేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలుకు ప్రభుత్వ లక్ష్యం పూర్తయ్యిందని చెప్పడం తగద న్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ఽ ధర ఇవ్వకపోవడం వలన ఇప్పటికే కోకో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ఉన్న ప్రతీ కోకో గింజ కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాని దేనన్నారు. కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానమిస్తూ ఫార్మూలా రూపొందించి కోకో గింజలను ధర నిర్ణయించే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోకో రైతు సంఘం నాయకులు సింహాద్రి గోపాలకృష్ణ, బోళ్ళ వెంకట సుబ్బారావు, గుదిబండి వీరారెడ్డి, పి.నరసింహా రావు, ఈడ్పుగంటి శ్రీనివాస్, జి.పెదవీర్రాజు, పర్వతనేని గోపాలరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, ఏలూరు జిల్లాతో సహా తూర్పు, పశ్చిమ, కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:50 AM