వైభవంగా జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం
ABN, Publish Date - Mar 12 , 2025 | 12:39 AM
కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం భక్తుల కోలాహలం మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు.
పెద్దింటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
కైకలూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం భక్తుల కోలాహలం మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి గోకర్ణపురం నుంచి గోకర్ణేశ్వర స్వామి వారిని పల్లకిపై ఊరేగింపుగా పెద్దింటి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి జలదుర్గా అమ్మవారికి గోకర్ణేశ్వరస్వామికి కల్యాణం నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి దేవదాయ, ధర్మాదాయ శాఖ నుంచి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజే శారు. వేలాదిమంది భక్తులు కల్యాణమహోత్సవాన్ని తిలకించా రు. మంగళవారం అమ్మవారికి నవవరణార్చన, కలశపూజ, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ వారికి పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, భక్తులకు ఉచిత ప్రసా దాన్ని మదునూరి కొండరాజు దంపతులు అందజేశారు. ఈవో కూచిపూడి శ్రీనివాసు ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిర్వహించారు.
Updated Date - Mar 12 , 2025 | 12:39 AM