లెక్కలు తేల్చాల్సిందే!
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:31 AM
సాగునీటి రంగంలో సమర్థ వంతమైన ప్రణాళిక అమలు చేసి జవసత్వాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు రంగం లోకి దిగాయి. జిల్లా స్థాయిలో ఆయ కట్టుకు నీరందించే చిన్నత రహా నీటి వనరుల గణన, ఇతర అవసరాలను తీర్చే జలాశయాల గణన (సెన్సెస్) చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.
జూలై 1 నుంచి చిన్నతరహా నీటివనరుల.. ఏడోవ గణనకు ఏర్పాట్లు
ఈసారి జలాశయాలు లెక్కింపు
సర్వే చేసిన వాటికి జియో ట్యాగింగ్ నంబర్
సాగునీటి రంగంలో సమర్థ వంతమైన ప్రణాళిక అమలు చేసి జవసత్వాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు రంగం లోకి దిగాయి. జిల్లా స్థాయిలో ఆయ కట్టుకు నీరందించే చిన్నత రహా నీటి వనరుల గణన, ఇతర అవసరాలను తీర్చే జలాశయాల గణన (సెన్సెస్) చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. జూలై ఒకటో తేదీ నుంచి ఏడోవ చిన్నతరహా నీటి వననరు లు, రెండో జలాశయాల గణనకు జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి జిల్లాలో 2017–18 మధ్య ఆరోసారి ఈ తరహా గణన చేపట్టారు. ప్రతి ఐదేళ్లకు సర్వే చేపట్టాల్సి ఉండగా సర్వే చేయలేదు. అయితే 2023–24 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేకు ఎన్యు మరేటర్ల రంగంలోకి దిగనున్నారు. ఈసారి డిజి టల్ తరహాలో ఇప్పుడున్న సమాచారాన్ని ఒక యాప్‌లోకి నమోదు చేసి ఎన్యుమరేటర్లను అను సంధానం చేశారు. తద్వారా డేటాను ప్రతీ ఎన్యు మరేటర్ యాప్‌లోనే సునాయాసంగా క్షేత్రస్థాయి లో పరిశీలన చేశాక ఎక్కడికక్కడ అప్‌డేట్ చేస్తా రు. ఎన్యూమరేషన్ చేసిన ప్రతిదానికి జియో ట్యాగింగ్ నంబర్‌ను ఇవ్వనున్నారు. దీంతో డిజిట లైజేషన్‌కు అందుబాటులో సమాచారం ఉంటుం ది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో ఈ నెల 18న జరి గిన వీడియో కాన్ఫరెన్స్‌లో విధివిధానాలు ఖరారు చే శారు.ఈ సర్వేకు పచ్చజెండా ఊపుతూ కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆమోదం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో 664 గ్రామాల్లో బోర్లు 776, నూతులు 2,209, లోతు తక్కువలోతైన బావులు 7,422, లోతైన బావులు 54,291 ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చిన్నతరహా జలాశయాలు 1,577, ఇతర మంచినీటి, చేపల చెరువులు 542 ఉన్నాయి.
జలాశయాలకు మహర్దశ
చిన్నతరహా జలవనరుల ప్రాజెక్టులు తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం అందిస్తాయి. దేశంలో ఇరిగేషన్‌శాఖ స్థానంలో జలవనరుల శాఖ ఏర్పాటు కావడంతో ఈసారి రెండో విడత జలాశయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్వే చేయనున్నారు. ప్రధానంగా ఈసారి పంచా యతీ చెరువులు,గొలుసుకట్టు, చేపల చెరువులు, మంచినీటి చెరువులపైన ఎక్కువ దృష్టి పెట్టారు.జలాశయాలపై ప్రత్యేక గణనను నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా జలాశయాల మరమ్మతులు, పునః నిర్మాణం, పునరుద్ధరణ, వాటర్ బాడీలపై ఆక్రమణలు తొలగింపును చేపట్టడానికి రాబోయే రోజులు నిధులు విడుదలకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కమిటీల పర్యవేక్షణ
మండల స్థాయిలో తహసీల్దార్ సెన్సస్ ఆఫీసర్‌గా వ్యవహరించనుండగా, మండల కన్వీనర్‌గా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్‌వో)ల ఎన్యూమరేటర్‌గా వీఆర్వో లేదా వీఆర్‌ఏ, సూపర్‌వైజర్‌గా డీటీ/ఏఎస్‌వో/ఆర్‌ఐలు సర్వే చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి మెంబర్ కన్వీనర్‌గా, సభ్యులుగా డీఆర్వో,పంచాయతీరాజ్, జలవనరులశాఖల ఎస్‌ఈలు, ఏపీఎస్‌ఐడీ ఈఈ, గ్రౌండ్‌వాటర్ డీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఐటీడీఏ పీవో, డ్వామా పీడీలుంటారు. జిల్లాలో చిన్నతరహా నీటి వనరులు గణనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వాసుదేవరావు తెలిపారు. జూలై ఒకటిన ప్రారంభించి ఆ నెలాఖరులోగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టామన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:31 AM