ధాన్యం సంచులు సిద్ధం
ABN, Publish Date - Apr 24 , 2025 | 01:17 AM
గుండుగొలనులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి బుధవారం పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి
భీమడోలు, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : గుండుగొలనులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సంచుల వివరాలు, కొనుగోలు లక్ష్యం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ధాన్యం కొను గోలుకు గోనె సంచులు సిద్ధం ఉన్నాయ న్నారు. సంచులు కూడా నాణ్యతగా ఉన్నాయన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌బాషా, ఏవో ఉషారాణి, ఏడీఏ ఉషారాజకుమారి, రైతులు పాల్గొన్నారు.
10లోగా ఎన్‌సీడీ సర్వే పూర్తి చేయాలి : కలెక్టర్
ఏలూరు అర్బన్: క్యాన్సర్, బీపీ, మధుమేహం, తదితర అసంక్రమిత వ్యాధుల నియం త్రణలో భాగంగా ఇంటింటా చేపట్టిన ఎన్‌సీడీ సర్వే మే 10లోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశిం చారు. ఎన్‌ఆర్‌పేట అర్బన్ హెల్త్ సెం టర్‌ను మంగళవారం ఆమె సందర్శించా రు. ఆమె ఎన్‌సీడీ సర్వేపై వైద్యాధికా రులతో సమీక్షించారు. నిర్ణీత సర్వే రోజు వారీ లక్ష్యాలను పూర్తిచేయనివారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ నరేంద్రకృష్ణ, మెడికల్ ఆఫీసర్ ప్రగతి, తహసీల్దార్ శేషగిరి పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 01:17 AM