ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూసేకరణకు అభ్యంతరం లేదు

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:07 AM

జాతీయ రహదారి 165 నిర్మాణంలో భూసేకరణకు అనుకూలంగా రైతులు అభిప్రాయాలు తెలిపారు.

ఎన్‌హెచ్‌ అధికారుల సమక్షంలో రైతుల అభ్యంతరాలపై విచారణ చేస్తున్న జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి

జాతీయ రహదారి 165 నిర్మాణం

లాభసాటి పరిహారం కోరిన రైతులు

భీమవరం రూరల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 165 నిర్మాణంలో భూసేకరణకు అను కూలంగా రైతులు అభిప్రాయాలు తెలిపారు. భీమవరం, గునుపూడి, రాయలం, తాడేరు, చిన అమిరం తదితర గ్రామ రైతుల అభ్యంతరాలపై జేసీ టి.రా హుల్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం ఎన్‌హెచ్‌ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. రోడ్డు అలైన్‌మెంట్‌, భూమికి పరిహారం అంశాలను జేసీ దృష్టికి తీసుకువచ్చారు. అలైన్‌మెంట్‌ మార్పు తమ పరిధిలోనిది కాదని, ఎల్‌ఏ యాక్ట్‌ –2013 నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. భూములను ప్రభుత్వానికి అప్పగించడానికి అభ్యంతరాలు లేవని, చిన్న రైతులమని, తాము నష్టపోకుండా న్యాయమైన పరిహారం త్వరగా ఇప్పించాలని రైతులు కోరారు. త్వరలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిం చి వివరాలను అందజేస్తామని తెలిపారు. ఎన్‌హెచ్‌ ఆర్‌ అండ్‌ బి డీఈఈ ఎన్‌.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ రావి రాంబాబు, ల్యాండ్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌. రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:07 AM