పేదలకు అండగా ఉందాం
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:35 AM
ప్రజలందరూ సేవాభావం అలవరచుకోవాలని, పేదలకు అండగా ఉందామని జాయింట్ కలెక్టర్ టి.రాహల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
దాతలు ముందుకు రావాలి
పీ4 సర్వేలో జేసీ పిలుపు
పెనుగొండ, జూలై23(ఆంధ్రజ్యోతి): ప్రజలందరూ సేవాభావం అలవరచుకోవాలని, పేదలకు అండగా ఉందామని జాయింట్ కలెక్టర్ టి.రాహల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పెనుగొండ మండలం నడిపూడి పంచాయతీ కార్యాలయం వద్ద పీ4 సర్వేలో భాగంగా బంగారు కుటుంబాల గ్రామసభ బుధవారం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పీ4 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించవచ్చునన్నారు. గ్రామాల్లో పేదరికం, ఆకలి బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చక్కటి ఆలోచన చేసి పీ4 కార్యక్రమం రూపొందించిందన్నారు. ముం దుగా గ్రామంలో పర్యటించి పలు కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. వడలిలో రైతు సేవా కేంద్రం వద్ద పలు రికార్డులను ఆయన పరిశీలించారు. తహసీల్దార్ జి.అనిత కుమారి, ఎంపీడీవో టి.సూర్యనారాయణమూర్తి, సర్పంచ్ కడలి బేబీ అన్నపూర్ణ, కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 12:35 AM