ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నరసాపురంలో ఉద్యోగ మేళా

ABN, Publish Date - Jul 24 , 2025 | 12:32 AM

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఉద్యోగ మేళాకు హాజరైన యువత

19 కంపెనీల ప్రతినిధుల ఇంటర్వ్యూ

450 మంది అభ్యర్థులు హాజరు

148 మంది ఉద్యోగాలకు ఎంపిక

నరసాపురం, జూలై 23(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కూటమి ప్రభుత్వం వివిధ ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తోంది. నరసాపు రం వైఎన్‌ కళాశాల హెచ్‌ఆర్డీ, ఏపీ స్కిల్స్‌ డపలప్‌మెంట్‌ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి 450 మంది యువత హాజరయ్యారు. 19 కంపెనీల ప్రతినిధులు ఇంట ర్వ్యూ చేసి 148 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. టెక్‌ మహేంద్ర, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు లైఫ్‌, మెట్‌, యాక్సిస్‌ బ్యాంకు, హెటెరో ఫార్మా, ఏయూ స్మాల్‌ బ్యాంకు, అపోలో ఫార్మసీ, డైకిల్‌, ముత్తూట్‌ పైనాన్స్‌, బీటీఎస్‌ గ్రూప్‌, కత్తర్‌కు చెందిన వెల్డర్స్‌ కంపెనీ, కువైట్‌కు చెందిన నిర్మాణ సంస్థ కంపెనీలు నియామకాలు చేపట్టాయి.

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంమని ఆర్డీవో దాసి రాజు అన్నారు. జాబ్‌ మేళ్లా ప్రారంభించిన ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మేళా యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోటీ ప్రపంచంలో ఉపాధి దొరకడం కష్టంగా మారిందన్నారు. ముందు ఏదో ఒక జాబ్‌లో చేరి ఆ ఆనుభవంతో మంచి కంపెనీల్లో వెళ్లేందుకు నిరుద్యోగులు ప్రయత్నించాలన్నారు.

కళాశాల కరస్పాండెంట్‌ అందే రామసతీష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కిల్‌ డవలప్‌మెంట్‌ జిల్లా మేనేజర్‌ లోక్‌మాన్‌ మాట్లాడుతూ జాబ్‌మేళా ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. యువతకు వివిధ అంశాలపై కూడా ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. తమ వెబ్‌సైట్‌లో చూసుకుని యువత దరఖాస్తు చేసుకుంటే అవకాశం ఇస్తామన్నారు. కార్యక్ర మంలో కోఆర్డినేటర్‌ కిశోర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:32 AM