ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చావంటే.. సహజమే !

ABN, Publish Date - May 20 , 2025 | 12:50 AM

జంగారెడ్డిగూడెంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడితే, అప్పట్లో జగన్‌ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది.

2022 మార్చి 14న జంగారెడ్డిగూడెంలో బాధిత కుటుంబాలను ఓదారుస్తున్న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు (ఫైల్‌)

2022 మార్చిలో జంగారెడ్డిగూడెం కల్తీ నాటు సారా చావులపై

నాడు జగన్‌ సర్కార్‌ ధోరణి

కేసులు పెట్టినా దిక్కూ మొక్కూ లేదు

ఇప్పుడు నిగ్గు తేల్చేందుకు బాబు సర్కార్‌ నిర్ణయం

నెల రోజుల్లో నివేదికిచ్చేలా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

పాత పోకడ లన్నీ తవ్వి తీసేందుకు రంగం సిద్ధం

ప్రభుత్వ నిర్ణయంపై బాధిత కుటుంబాల హర్షం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

జంగారెడ్డిగూడెంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడితే, అప్పట్లో జగన్‌ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది. వరుసగా కల్తీ నాటు సారా తాగి చనిపోతున్నారని గొల్లు మంటే.. అబ్బేబ్బే ఈ చావులన్నీ సాధారణమే అన్నారు. అసలు సారా తయారీ కావడం లేదని బొంకారు. అక్కడక్కడ ఆగ్రహంతో ఊగిపోతున్న వారిని అప్పటికప్పుడు మేనేజ్‌ చేశారు. కల్తీ సారా కారణంగానే పదుల సంఖ్యలో జనం చనిపోయారని మిగతా పక్షాలు పేర్కొంటే.. శవ రాజకీయమంటూ కొట్టిపారేశారు. స్టేషన్ల వరకు వెళ్లి కేసుల పెడతామని ప్రయత్నిస్తే కాదు పొమ్మన్నారు. ఇదంతా 2022 మార్చి నెలలో జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. అప్పట్లో కొవిడ్‌ తగ్గి, తగ్గక మునుపే పట్టణంలో పిట్టల్లా రాలిపోతే, కనీసం అప్పటి సర్కార్‌ విచారించనూ లేదు. నివేదికలు కోరలేదు. సారా లేనేలేదంటూ ప్రగల్భాలు పలికింది. కేవలం తమ వారు ఎందుకు చనిపోతున్నారో తేల్చాలని ఎవరైనా డిమాండ్‌ చేసినా కాదు పొమ్మన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆనాటి స్థితిగతులపై కొందరు ఫిర్యాదుచేశారు. అప్పట్లో తాము ఫిర్యాదు చేసిన విచారించలేదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతస్థాయిలో ఇప్పుడు కదలిక వచ్చింది. అప్పట్లో జరిగిన మరణాలపై ఇప్పుడు నిగ్గు తేల్చేందుకు సిద్ధం అయ్యారు. నెల రోజుల్లోపే తగిన నివేదికను రాబట్టబోతున్నారు.

మృతుల కుటుంబాలకు అండగా..

ఆనాడు కుటుంబ పెద్ద కుప్పకూలినా కనీసం అంత్యక్రియ లకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఆనాడు ఉన్న జగన్‌ ప్రభుత్వంలో పెద్దలకు భయపడే ఎవరూ నోరెత్తలేక పోయారు. కనీసం ఇదేమి అన్యాయమని ప్రశ్నించేందుకు సాహసించలేకపోయారు. ఇదే తరుణంలో ఘటన జరిగిన కొద్ది రోజులలోనే అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నేనున్నాంటూ జంగారెడ్డిగూడెంలో బాధిత కుటుంబాల వద్దకు వచ్చారు. బహిరంగంగానే సారా తాగి చనిపోయిందీ 26 మంది అని స్థానికులే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రజల కళ్లుగప్పి ఏమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతూనే మృతుల కుటుం బాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. పేద వర్గాలతో జగన్‌ సర్కార్‌ ఆటలాడు కుంటున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు మేరకు మరోమారు టీడీపీ ప్రభుత్వం కార్యరంగంలోకి దిగింది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022 మార్చిలో చనిపోయిన వారంతా ఏయే కారణాలతో మృతి చెందారో నిగ్గు తేల్చేందుకు ఉత్తర్వులిచ్చారు. దీంతో మృతుల కుటుంబాల్లోను కొంతమేర సంతృప్తి వ్యక్తమవుతోంది. ఘటన జరిగి మూడేళ్లు కావొస్తున్నా తమకు అందిన ఫిర్యాదు మేరకే ప్రభుత్వం స్పందించడం మరో విశేషం. ప్రభుత్వం నిర్ణయాన్ని బాధిత కుటుంబాలు స్వాగతించాయి.

Updated Date - May 20 , 2025 | 12:50 AM