పెరుగుతూ.. శాంతిస్తూ..
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:14 AM
గోదావరి నీటి మట్టం నెమ్మదిగా పెరిగి నెమ్మదిగా తగ్గుతోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు భద్రాచలం వద్ద 38.80 అడుగుల నీటి మట్టం ఉండగా శనివారం ఉదయం 6గంటలకు 40.40 అడుగులకు చేరుకుంది.
దాచారం పునరావాస కాలనీకి తరలివెళ్లిన 170 కుటుంబాలు
ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా అధికారులు
కుక్కునూరు/ వేలేరుపాడు/పోలవరం : గోదావరి నీటి మట్టం నెమ్మదిగా పెరిగి నెమ్మదిగా తగ్గుతోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు భద్రాచలం వద్ద 38.80 అడుగుల నీటి మట్టం ఉండగా శనివారం ఉదయం 6గంటలకు 40.40 అడుగులకు చేరుకుంది. అనంతరం నెమ్మదిగా పెరుగుతూ సాయంత్రం 4గంటలకు 41.30 అడుగులకు చేరింది. అనం తరం నిలకడగా ఉండి సాయత్రం 6గంటలకు 41.20 అడు గులకు తగ్గింది. గోదావరి ప్రభావంతో కుక్కునూరు, దాచారం గ్రామాల మధ్య గుండేటివాగు నీటమునగగా ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిని కూడా వరదనీరు ముం చెత్తింది. కుక్కునూరు నుంచి వేలేరుపాడు వెళ్లే ప్రజలంతా వయా నల్లకుంట మీదుగా తిరిగి వెళ్తున్నారు. గొమ్ము గూడెం నుంచి 170 కుటుంబాలు దాచారం పునరావాస కాలనీకి తరలివెళ్లాయి. జడ్పీ సీఈవో శ్రీహరి, జంగారెడ్డి గూడెం ఆర్డీవో రమణ, ఐటీడీపీవో రాములనాయక్, దాచారం పునరావాసకాలనీలో నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వాసి తులకు తాగునీటి సౌకర్యం కోసం కొత్తగా మూడుబోర్లు ఏర్పాటు చేశారు. లచ్చిగూడెం గ్రామస్థులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు తరలివెళ్లండి..
రానున్న ఈ మూడు నెలల పాటు వరదల కాలం కాబట్టి ముంపు గ్రామాల ప్రజలు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు తరలివెళ్లాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ.రమణ, పీడీ డీఆర్‌డీఏ విజయరాజు ప్రజలను కోరారు. తాడువాయిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తెలి పారు. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో శనివారం అధికారులు పర్యటించి గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది భూదేవి పేట, బండ్లబోరు, దాచారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు తరలివెళ్లగా మిగిలిన వారిని తాడువాయి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు తర లించేందుకు చర్యలు చేట్టారు. తహసీ ల్దార్ కార్యాలయంలో వరదలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎద్దువాగు వద్ద నీటమునిగిన లోలెవల్ కాజ్‌వే వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. తహసీల్దార్ సత్యనారాయణ, ఇతర అధికారులు, జనసేన మండల అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టిసీమ శివ క్షేత్రం చుట్టూ వరద జలాలు చుట్టు ముట్టాయి. గోదావరి లంక భూములు నీటమునిగాయి. గండి పోశమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది.
అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్
ఏలూరు,జూలై 12(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గోదావరి వరదలు తగ్గే వరకు అధికార యంత్రాంగమంతా అప్ర మత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపు పరిస్థి తిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వరదల కారణంగా ఒక్కరికి ప్రాణ,ఆస్తి నష్టాలు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరదనీరు ఉదృతంగా ప్రవ హించే కల్వర్టులు, కాజ్‌వేలు, రహదారులను ముంద స్తుగానే మూసి ఉంచడంతో పాటు ప్రజలు ప్రయా ణించకుండా ఆ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించాలన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 01:14 AM