ఏలూరు జిల్లాలో భారీ వర్షం
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:50 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
22.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
ఏలూరు సిటీ/కుక్కునూరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ వారం ఉదయం నుంచి జిల్లాలో మబ్బుల వాతావర ణం ఏర్పడింది. సాయంత్రం ఈదురుగాలులతో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో స్వల్పంగా, మరి కొన్ని చోట్ల జోరుగా వర్షం కురిసింది. ఈనెల 24న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు సార్వా పంటల సాగుకు అనుకూలిస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. వర్షాల రాకతో సార్వా వరి, ఇతర పంటల సాగు కొనసాగుతోంది.
కుక్కునూరు మండలంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు వర్షం కురి సింది. 15 రోజులుగా వర్షాలు లేక పత్తిపంట మొక్క దశలోనే ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. తడులు అందక రైతులు వర్షం కోసం ఎదరుచూ స్తూనే ఉన్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో పత్తి రైతుల ఆశలు చిగురించాయి. మొక్కలకు పత్తి పంటలో దుక్కులు దున్ని మందులు వేయడానికి రైతాంగం సన్నద్ధమవుతున్నారు. వర్షాలతో పత్తి సాగు కొంత మేర అనుకూలంగా ఉంది.
జిల్లాలో 22.5 మి.మీ. వర్షపాతం
జిల్లాలో గడచిన 24 గంటల్లో సరాసరి వర్షపాతం 22.5 మిల్లీమీటర్లు నమోదైంది. టి.నరసాపురం మండలంలో అత్యధికంగా 60.2 మి.మీ. బుట్టాయ గూడెంలో అత్యల్పంగా 3.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగపాలెంలో 53.6, ముసునూరు 52.4, ద్వా రకాతిరుమల 40, కామవరపుకోట 38.8, పోలవరం 34, చింతలపూడి 32.2, చాట్రాయి 31.4, భీమడోలులో 24.2, ఆగిరిపల్లి 23.2, మండవల్లి 21.2, కలిదిండి 20.6, కైకలూరు 18.4, జంగారెడ్డిగూడెం 17.2, దెందు లూరు 17, ముదినేపల్లి 16.8, ఏలూరు అర్బన్ 16.4, పెదవేగి 16.4, ఉంగుటూరు 16, నూజివీడు 14.6, ఏలూరు రూరల్ 14.2, వేలేరుపాడు 12.2, నిడమర్రు 12.2, పెదపాడు 10.4, కుక్కునూరు 7.2, కొయ్యలగూడెం 5.8, బుట్టాయిగూడెంలో 3.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
Updated Date - Jul 22 , 2025 | 11:50 PM