ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కుక్కలపై తుపాకీ కాల్పులు

ABN, Publish Date - May 30 , 2025 | 12:05 AM

జిల్లా కేంద్ర మైన ఏలూరు సమీపంలో శునకాలపై ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. పట్టపగలు బహిరంగ కాల్పులతో ప్రజలు భయభ్రాంతులయ్యారు.

కాల్పులకు ముందు గుంపులుగా శునకాలు

ఏలూరులో ఆగంతకుల దుశ్చర్య

తొమ్మిది శునకాల మృత్యువాత

ఒక పెంపుడు కుక్క మృతితో నిలదీసిన యజమానికి బెదిరింపు

తుపాకీ శబ్దాలతో హడలిపోయిన పిల్లలు

భయభ్రాంతులైన స్థానికులు

ఏలూరు క్రైం, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర మైన ఏలూరు సమీపంలో శునకాలపై ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. పట్టపగలు బహిరంగ కాల్పులతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. కాల్పులపై అడిగిన వారిని బెదిరించారు. చనిపోయిన వాటిలో ఒక పెంపుడు కుక్క ఉందని ప్రశ్నించిన యజమానికి సైతం ఎవరికైనా చెప్పినా ఊరుకోబోమని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లారు. బిక్కుబిక్కు మంటున్న ఆ కుటుంబానికి చుట్టు పక్కల వారు ధైర్యం చెప్పి జంతు సంరక్షణ సమితి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కాల్పుల సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఏలూరు శనివారపుపేట వీవర్స్‌ కాలనీ, చింతమనేని కాలనీ ప్రాంతానికి సమీపంలో ఒక కోళ్ల ఫాం ఉంది. తరచుగా కోళ్ల ఫాం వద్ద కుక్కలు కోళ్లను పట్టుకు తింటున్నాయని చెబుతున్నారు. ఈనెల 27న సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పాత మోటారుసైకిల్‌పై తుపాకీ పట్టుకుని వచ్చారు. గుంపుగా ఉన్న కుక్కలను కాల్చారు. ఒక కుక్కను చంపగానే ఒక పెంపుడు కుక్క వారిపైకి వెళ్లడంతో దానిని కూడా కాల్చేశారు. ఆ కుక్క యజమానులు ప్రశ్నిస్తే ఆగంతకులు భయపెట్టారు. తుపాకీ కాల్పులు వినబడడంతో సమీపంలో ఆడుకుం టున్న పిల్లలు పారిపోయారు. మద్యం మత్తులో ఆగం తకులు ఇద్దరు అక్కడే తిరిగి చనిపోయిన కుక్కలను పక్కనే ఉన్న తమ్మిలేరు కాల్వలోకి విసిరేశారని స్థాని కులు చెబుతున్నారు. కుక్కలను చంపకూడదని ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి కోళ్ల ఫాం యజమాని దుర్మార్గంగా వీధికుక్కలను బహిరంగంగా తుపాకీతో కాల్పి చంపించడంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని ఆగతంకులు బెదిరించారని పెంపుడు కుక్క యజమానులు చెబుతున్నారు. వారి నుంచి తమకు పోలీసులు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 30 , 2025 | 12:05 AM