ఉన్నారా ? ఉడాయించారా ?
ABN, Publish Date - May 18 , 2025 | 11:32 PM
ప్రభుత్వాసు పత్రుల్లో వైద్యసేవల లోపం, వైద్యాధికారుల హాజరు, తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలకు కలెక్టర్ వెట్రి సెల్వి నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసిబ్బంది అందుబాటుపై ‘రెవెన్యూ’ ఆకస్మిక తనిఖీలు
వైద్యసేవల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ నిశిత పరిశీలన
పలు పీహెచ్‌సీల్లో ఇప్పటికీ డాక్టర్ ఒక్కరే!
ఏలూరు అర్బన్, మే 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసు పత్రుల్లో వైద్యసేవల లోపం, వైద్యాధికారుల హాజరు, తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలకు కలెక్టర్ వెట్రి సెల్వి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పోలవరం, కైకలూరు, చాటపర్రువంటిచోట్ల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో రోగులకు సకాలం లో వైద్యసేవలందించడంలో తలెత్తిన అవాంఛనీయ పరిణామాలు, నష్టంపై దృష్టి సారించిన కలెక్టర్ పూర్తిస్థాయి పర్యవేక్షణ చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో స్థానికం గా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వా సుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలకు పురమాయిం చారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోతే కాస్తా కఠినచర్యలనే తీసుకుంటా మని సంకేతాలు పంపారు. వైద్యసేవల్లో లోపాలను సహించబోమని హెచ్చరించారు. శనివారం రాత్రి జిల్లావ్యాప్తంగా పలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళ్లి, అక్కడ విధుల్లో వున్న మెడికల్ ఆఫీ సర్లు, ఇతర సిబ్బంది గురించి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ఆక స్మిక తనిఖీలు ఉద యం, రాత్రి 10 గంటల తర్వాత ఇకమీదట కూడా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆ పీహెచ్‌సీల్లో ఒక్కరే డాక్టర్
జిల్లావ్యాప్తంగా 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో ఇద్దరు వైద్యాధి కారులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ఎఫ్‌ఎన్‌వో/ఎంఎన్‌వో, నైట్ వాచ్‌మెన్, సీనియర్ అసిస్టెంట్, తదితర వైద్యసిబ్బంది ఉంటారు. ప్రతీ పీహెచ్‌సీ 24 గంటలూ పనిచేసేలా నిర్దేశించారు. ఆదివారా లు, పండుగరోజుల్లో సైతం పీహెచ్‌సీలు తెరిచిఉంచాల్సిందే. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిగంటలు నిర్ణయించి, వీరిలో ఒకరు గ్రామాల్లో సచి వాలయాలకు వెళ్లి 104 వైద్యసేవల కింద రోగులను పరీ క్షించి వైద్యసేవలందించాల్సి ఉంటుంది. మరొక మెడికల్ ఆఫీసర్ పీహెచ్‌సీలో విధుల్లో ఉండాలి. ఇలా ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఒకరు పీహెచ్‌సీలో ఉంటే, మరొక రు 104 వైద్యసేవల్లో ఉండేలా జాబ్‌చార్టు రూపొందించారు. డెలివరీ, అత్యవసర కేసులు వస్తే ఆన్‌కాల్ డ్యూటీకి అర్ధరాత్రి అయినా పీహెచ్‌సీకి మెడికల్ ఆఫీసర్ హాజరుకావాల్సిందే. రాత్రివేళల్లో పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సు, కంటింజెంట్ వర్కర్, నైట్ వాచ్‌మెన్ అందు బాటులో ఉండితీరాలి. జాబ్‌చార్టు ఇంతస్పష్టంగా ఉన్నప్పటికీ జిల్లాలో సుమారు 10 పీహెచ్‌సీలకు సాయంత్రం 4 గంటలకే తాళాలువేసి మెడికల్ ఆఫీసర్‌తో సహా, మిగతా సిబ్బంది వెళ్లిపోతున్నట్టు సమాచారం. ఇటువంటి అనైతిక పనులన్నీ తాజాగా చేపడుతున్న ఆకస్మిక తనిఖీలతో అడ్డుకట్ట వేయ వచ్చని భావిస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో గ్రామాల్లో పీహెచ్‌సీలు వైద్యసేవలకు అందు బాటులో ఉంటాయని చెప్పవచ్చు. కానీ జిల్లాలో కొల్లేటికోట, మండవల్లి, కలిదిండి, మూలలంక, పూళ్ల, ద్వారకాతిరుమల, కామవరపుకోట, తడికలపూడి, లింగపాలెం, కోండ్రుకోట, కొయిడా, అమరవరం పీహెచ్‌సీల్లో ఒక్కొక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. వీటిలో పనిచేసిన వైద్యాధి కారుల్లో పలువురికి పీజీ వైద్యవిద్య సీట్లు రావడంతో వెళ్లిపోయారు. మరోవైపు పీహెచ్‌సీల్లో పనిచేయాల్సిన మెడికల్ ఆఫీసర్లలో పలువురు నిబంధనలకు విరుద్ధంగా ఏలూరులోని అర్బన్ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నారు. దీంతో పీహెచ్‌సీల్లో వైద్యసేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. కలెక్టర్ వెట్రిసెల్వి కీలకమైన ఈ సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తే క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో రోగులకు నాణ్యమైన వైద్యం లభిస్తుందని చెప్పవచ్చు.
Updated Date - May 18 , 2025 | 11:32 PM