ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సర్కారీ వైద్యం.. మెరుగ్గా!

ABN, Publish Date - Apr 25 , 2025 | 12:07 AM

జిల్లాలోని ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకం డరీ హెల్త్‌ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలను అందించడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు.

జిల్లాలో ఆసుపత్రులకు మహర్దశ

ఇకపై జిల్లా ఆసుపత్రిగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి

అన్ని ఆసుపత్రులలో ఎక్స్‌రే మిషన్లు, 24 గంటలు సేవలు

అందుబాటులో కుక్కకాటు,పాము కాటుకు వ్యాక్సిన్లు

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) :

జిల్లాలోని ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకం డరీ హెల్త్‌ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలను అందించడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. ప్రతిపాదనలన్నీ ఆమోదం పొందితే జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందనున్నాయి.

జిల్లా ఆసుపత్రిగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో ఏలూరు ప్రభుత్వా సుపత్రిని జిల్లా ప్రభుత్వాసుపత్రిగా ఉండేది. దానిని మెడికల్‌ కాలేజీ టీచింగ్‌ ఆసుపత్రిగా మార్చి డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో కలిపివేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తు తం జిల్లా ఆసుపత్రి లేదు. పోలవరం ఏజెన్సీ గ్రామాలు, కుక్కునూరు, వేలేరుపాడు మండ లాలు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండ లాల్లోని ప్రజలు ఏలూరులోని మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి రావాలంటే 60 నుంచి 100 కిలోమీటర్లు పైబడే దూరం ఉంటుంది. ఈ దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతానికి, మెట్ట ప్రాంతా నికి అందుబాటులో ఉండేలా జంగారెడ్డి గూడెంలో ఉన్న వంద పడకల ఏరియా ఆసు పత్రిని జిల్లా ఆసుపత్రిగా 350 పడకలతో తీర్చిదిద్దాలని నివేదికలను సిద్ధం చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా కొనసాగించడానికి అక్కడ అవసరమైన ప్రత్యేక వైద్య సేవ విభాగాల ఏర్పాటుకు చర్యలను తీసుకోనున్నారు. జిల్లాలో ఉన్న సెకండరీ హెల్త్‌ ఆసుపత్రు లన్నింటిలో ఎక్స్‌రే మిషన్లను ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు అత్యవసర విభాగాల్లో కూడా ఎక్స్‌రే తీయడానికి సిబ్బం దిని నియమించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఫ నూజివీడు ఆసుపత్రిలో ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌ భవనాన్ని అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతి రాగానే కొత్త భవనంలో ఈ బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురాను న్నారు. అవసరమైన వైద్య పరికరాలను, ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు.

ఫ చింతలపూడి ఆసుపత్రి ప్రస్తుతం 50 పడ కలు ఉండి కమ్యూనిటీ హెల్త్‌ ఆసు పత్రిగా ఉంది. జిల్లాకు ఒక ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబరేటరీ మంజూరు కావడంతో దానిని చింతలపూడిలోనే ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఐపీహెచ్‌ఎల్‌ లేబరేటరీలో ప్రత్యేక రక్తపరీక్షలు నిర్వహి స్తారు. లివర్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌, వైరల్‌ టెస్టులు, కిడ్నీకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలను నిర్వహించనున్నారు.

ఫ దెందులూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ప్రస్తుతం 30 పడకలు ఉండగా దానిని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడా నికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అక్కడ అదనపు వైద్య సేవలు అందించడానికి చర్యలను తీసుకోనున్నారు.

ఫ భీమడోలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 30 పడకల ఆసుపత్రిగా ఉంది. మరో 20 పడకలను అదనంగా ఏర్పాటు చేసి ట్రామా కేర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారి వెంబడి జరిగే రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందించడానికి ఈ ట్రామాకేర్‌ యూనిట్‌ ఉపయోగ పడుతుంది.

ఫ కైకలూరు ఆసుపత్రిలో ప్రస్తుతం 30 పడకలు ఉన్నాయి. అక్కడ ఎముకల శస్త్ర చికిత్స విభాగాలను అభివృద్ధి చేయడానికి సీయాం మిషన్‌, ఈఎన్‌టీ ఆపరేషన్లకు అవసరమైన యంత్ర పరికరాలు, మైక్రోస్కోప్‌, కంటి వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రతిపా దనలు సిద్ధం చేశారు. పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఫ పోలవరం ఆసుపత్రిలో ప్రస్తుతం 30 పడకలు ఉన్నాయి. కొత్త భవనాల నిర్మాణం పూర్తవ్వగానే అదనపు ప్రత్యేక వైద్య విభాగా ల సేవలు అందించడానికి చర్యలు తీసుకుం టారు. ఇప్పటికే ఐటీడీఏ ద్వారా చిన్నపిల్లల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. న్యూ బోరన్‌ స్టెపిలేజింగ్‌ యూనిట్‌, బర్త్‌ వెయిటింగ్‌ రూమ్‌ వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఏజెన్సీ ప్రజలకు అత్యవసర మందులు, పాముకాటు, కుక్కకాటు వ్యాక్సిన్లు నిల్వలను ఉంచడానికి చర్యలు చేపట్టారు.

ఫ బుట్టాయిగూడెం ఆసుపత్రిలో 30 పడకలు ఉన్నాయి. పేషెంట్‌ వెయిటింగ్‌ హాల్‌, గర్భిణులకు వెయిటింగ్‌ హాలు, విశ్రాంతి రూముల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఐటీడీఏ సహకారంతో వీటిని నిర్వహిస్తారు. పాముకాటు, కుక్కకాటు వ్యాక్సిన్లుతో పాటు పురుగుమందు ఘాటుకు ఎవరైనా ప్రమాదానికి గురయితే వారికి త్వరగా వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక విభాగాలను సిద్ధం చేయనున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:07 AM