యజమాని ఇంట్లో బంగారం చోరీ
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:32 AM
రొయ్యల చెరు వుల యజమాని వద్ద పనిచేసే యువకుడు యజమాని ఇంటికి కన్నం వేశాడు.
పోలీసులకు చిక్కిన నిందితుడు
33 కాసుల ఆభరణాలు స్వాధీనం
ఏలూరు క్రైం, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రొయ్యల చెరు వుల యజమాని వద్ద పనిచేసే యువకుడు యజమాని ఇంటికి కన్నం వేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిఘా పెట్టి అతడిని అరెస్టు చేశారు. రూ.23.76 లక్షల విలువైన 33 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కిశోర్ వివరాలు తెలి పారు. గణపవరం గ్రామానికి చెందిన చిలువూరి వెం కట రామరాజు అలియాస్ వెంకన్నబాబు రొయ్యల చెరువుపై అదే గ్రామానికి చెందిన సరిపల్లి రాజు అలి యాస్ వెంకటరాజు (32) పనిలో చేరాడు. పేకాట, మద్యం, క్రికెట్ బెట్టింగ్‌కు సరిపల్లి రాజు బానిస అయ్యా డు. అతని జీతం సరిపోకపోవడంతో యజమాని ఇంట్లో దొంగతనం చేయాలని పథకం వేశాడు. గత మే నెలలో ఇంటి యజమాని హైదరాబాద్ వెళ్లారు. జూన్ మొదటి వారంలో రాత్రిపూట సరిపల్లి రాజు ఆ ఇంటికి వెళ్లి వెనకవైపు తలుపులు పగులగొట్టి, బెడ్రూమ్‌లో బీరువా కూడా పగులగొట్టి 262.780 గ్రాముల (సుమారు 33కాసులు) బంగారు ఆభరణాలు అపహరించుకుపో యాడు. ఈ సంఘటనపై గణపవరం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణ లో నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, గణపవరం ఎస్‌ఐ మణికుమార్, హెడ్‌కానిస్టేబుల్ ఏయూజీ.శంకర్, కానిస్టేబుల్ శివాజీ, హోంగార్డు పి.జగపతిబాబు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఉంచారు. సరిపల్లి రాజు మంగళవారం తాను దొంగిలించిన బంగారాన్ని భీమవ రంలో విక్రయించడానికి వెళుతుండగా సరిపల్లి వద్ద అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద 33 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో చాకచక్యంగా పనిచేసిన అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను అందించారు.
Updated Date - Jun 11 , 2025 | 12:32 AM