భీమవరం ఇవ్వండి
ABN, Publish Date - May 15 , 2025 | 01:01 AM
జిల్లాలోని పట్టణాలు, పల్లెలు ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఈయూ డీఏ) పరిధిలో ఉన్నాయి. నిర్మాణాలకు ఈయూడీఏ ప్లాన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు కావడంతో భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
తొలుత మునిసిపల్ కార్పొరేషన్ స్థాయి కల్పించాలి
ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రతిపాదనలు
జిల్లాలోని పట్టణాలు, పల్లెలు ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఈయూ డీఏ) పరిధిలో ఉన్నాయి. నిర్మాణాలకు ఈయూడీఏ ప్లాన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు కావడంతో భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు పర్యటనలో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. భీమవరం ఇప్పటికీ మునిసిపాలిటీ కావడంతో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు అవరోధం కానుంది. దీనితో ఇప్పటికే కార్పొరేషన్ హోదా ప్రతిపాదన ఉన్న దృష్ట్యా ఆ మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం మునిసిపాలిటీలతో పాటు ఆకివీడు నగరపంచాయతీ ఉంది. పట్టణాలకు ఆనుకుని మేజర్ పంచాయతీలు విస్తరించి ఉన్నాయి. ప్రత్యేక అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లా ప్రజా ప్రతి నిధులు సైతం ఆ దిశగా ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెడుతున్నారు. పొరుగున రాజమండ్రి, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలున్నాయి. ఆ దిశ గానే ఇక్కడ కూడా ఏలూరు, భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఉంటే అనుమతులు, పాలన సులభతరమవుతుందంటూ జిల్లా ప్రజల్లో ఆకాంక్ష బలంగా నాటుకుంది. ప్రభుత్వ నిర్ణయం కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
నిర్మాణ అనుమతులు లేవు!
జిల్లాలో నాన్ లేఅవుట్‌లు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. గత ఐదేళ్లలో మరీ అధికం, పెద్ద ప్రాజెక్ట్‌లు, అపార్ట్‌మెంట్‌లు నిర్మించే బిల్డర్లు మాత్రమే లేఅవుట్ వేసి నిర్మాణాలు, ప్లాట్‌ల అమ్మకాలు చేపడుతున్నారు. ఇళ్లు నిర్మించుకునే వారంతా నాన్ లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ ఇళ్లు నిర్మించుకోవాలంటే అనుమతులు ఇవ్వడం లేదు. బెటర్‌మెంట్ చార్జీలు చెల్లిస్తే ప్లాన్ ఇచ్చే అవకాశం ఉన్నా పంచాయతీల్లో మెలిక పెడుతున్నారు. ఈయూడీఏ అనుమతి తెచ్చుకో వాలంటూ చేతులెత్తేస్తున్నారు. పంచాయతీల పరిధిలో 10 శాతం బెటర్‌మెంట్ చార్జీలు చెల్లిస్తే నాన్ లేఅవుట్ లో కూడా ప్లాన్ ఇవ్వాలి. ఏలూరు అర్బన్ డెవలప్‌మెం ట్ అథారిటీ పేరుచెప్పి ప్లాన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నా రు. గ్రామ కార్యదర్శులు బాధ్యతను విస్మరిస్తున్నారు.
ఆదాయం గోవిందా..
పంచాయతీల్లో ప్లాన్‌లు ఇవ్వకపోవడంతో ఆదాయం కోల్పోవలసి వస్తోంది. ప్లాన్ అనుమతి రుసుము ఈయూడీఏ ఖాతాలో జమ అవుతుంది. అక్కడ నుంచి పంచాయతీలకు సొమ్ములు రావడం లేదు. ఈయూ డీఏకు జమ అయిన సొమ్ములో 80శాతం పంచాయ తీలకు రావాలి. ఇప్పటి వరకు జిల్లాలో పట్టణాలు, పల్లెలకు దాదాపు రూ.100 కోట్లు మేర ఆదాయం నిలిచి పోయింది. భీమవరం రూరల్ మండలంలోని చిన అమిరం, రాయలం గ్రామాలకు దాదాపు రూ.6 కోట్లు రావాల్సి ఉందని లెక్కలు కట్టారు. ఈయూడీఏ అనుమతులు పొందితే పంచాయతీలకు రావాల్సిన నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. పైగా ప్లాన్ పొందాలంటే అధికంగా సొమ్ములు వెచ్చించాల్సి వస్తోంది. నిర్మాణదారులపై భారం పడుతోంది. ఇటీవల సొంత ఇళ్లు నిర్మించుకునే వారికి పంచా యతీల్లో ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతు న్నాయి. ప్రభుత్వం ప్లాన్‌లను సులభతరం చేసేం దుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌లు (ఎల్‌టిపి) పెన్‌డౌన్ చేశారు. నిర్మాణాల్లో అతిక్రమణలకు పాల్పడితే వారిపై చర్య లు ఉంటా యనడంతో వారు వెనుకడుగు వేస్తున్నా రు. పట్టణా ల్లో ప్లాన్‌లు నిలచిపోయాయి. పల్లెల్లో కార్యదర్శులు నిరాకరిస్తున్నారు. మొత్తంపైన ప్లాన్‌లు నిలచిపోతున్నా యి. పట్టణాలు, పల్లెలకు ఆదాయం పడిపోతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కావాలన్న వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి పెంచాల్సి ఉంది.
Updated Date - May 15 , 2025 | 01:01 AM