ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగునీటికి ఊపిరి..

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:09 AM

నరసాపురం,యలమంచిలి మండలాల్లోని స్లూయి స్‌లకు రూ.8.8 కోట్లు కేటాయిస్తూ బుధవారం కేబినెట్‌ సమావేశంలో ఈ పనులకు ఆమోదం తెలిపింది.

నల్లిక్రీక్‌

జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం

నల్లి క్రీక్‌కు రూ.17 కోట్లు.. స్లూయిస్‌లకు రూ.8.8 కోట్లు కేటాయింపు

నరసాపురం, జూలై 10(ఆంధ్రజ్యోతి):గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ తీరు అస్తవ్యస్తంగా ఉండేది. లాకులకు గ్రీజ్‌ పెట్ట లేదు. డ్రైనేజీల్లో గంపెడు మట్టి తీయలేదు. గోదా వరి వరదల వేళ.. పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది. ఏటిగట్ల పటిష్టత, స్లూయిస్‌ల లీకేజీలు, మరమ్మ తులకు కనీసం ఒక్క రూపాయి విడుదల చేయ లేదు. కూటమి అధికారంలోకి రాగానే వీటిపై శ్రద్ధ పెట్టింది. నియోజకవర్గాల వారీగా పెండింగ్‌ పనుల వివరాలను రప్పించుకుంది.రాష్ట్రంలో తొలి విడతగా 71 ప్రాజెక్టులకు ఊపిరిపోసింది. వాటి లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న నల్లి క్రీక్‌ ఒక టి. పూడుకుపోయిన ఈ క్రీక్‌కు రూ.17.66 కోట్లు, నరసాపురం,యలమంచిలి మండలాల్లోని స్లూయి స్‌లకు రూ.8.8 కోట్లు కేటాయిస్తూ బుధవారం కేబినెట్‌ సమావేశంలో ఈ పనులకు ఆమోదం తెలిపింది. దీనిపై గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాజ, ఈస్ట్‌ కొక్కిలేరుకు మోక్షం

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద నియంత్రణకు స్లూయిస్‌లు కీలక పాత్ర పోషి స్తాయి. పోటు పాటులకు నీరు బయటకు పోకుండా ఇవి అడ్డుగా నిలుస్తాయి. వరదల సమయంలో నీరు పంట కాల్వలు, డ్రైనేజీల గుండా వెళ్లకుండా నియంత్రించడంలో స్లూయిస్‌ లు కీలకం. ఈ స్లూయిస్‌ల నిర్వహణ సక్రమంగా లేక ఇవన్నీ శిఽథిలావస్థకు చేరాయి. యలమంచిలి మండలం కాజ, నరసాపురం మండలం ఈస్ట్‌ కొక్కిలేరు, ముస్కేపాలెం, నరసాపురంలోని ఐదు తూములు వీటిలో ప్రధానం. కాజ స్లూయిస్‌ వల్ల వరదల సమయంలో వేలాది ఎకరాలు నీట ము నిగాయి. ఇటు నరసాపురం మండలంలోని ఈస్ట్‌ కొక్కిలేరు పనులు చేపట్టమని గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు రైతులు అనేక ఉద్యమా లు చేపట్టారు. శిఽథిలమైన కొక్కిలేరు పనులు చేపట్టకపోవడంతో తీర ప్రాంతంలోని రైతులు సాగు విరమించారు. నరసాపురం పట్టణంలోని ఐదు తూముల గేట్లన్నీ శిథిలమయ్యాయి. వరద లు వస్తే నీరంతా డ్రెయిన్లలోకి చేరుతుంది. ఫలి తంగా చినమామిడిపల్లి, సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం, మల్లవరంలంక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగిపోతున్నాయి. ముస్కేపా లెం స్లూయిస్‌ది ఇదే పరిస్థితి. వరదొస్తే పీచుపా లెం ప్రాంతంలోకి నీరు చేరుతుంది. అత్యవస రంగా చేపట్టాల్సిన ఈ పనులకు తొలి విడతలో రూ.8.8 కోట్లు ఇచ్చారు.

ఎన్నికల హామీ అమలు చేశాం

అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఉపాధిని పెంచే నల్లి క్రీక్‌ తవ్వకం పనులు చేపడతామని ఇచ్చిన హామీ మేరకు తొలి విడతలోనే నల్లి క్రీక్‌ పనుల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి రూ.17.66 కోట్లు మంజూరుచేసినట్లు మత్స్యకార సహకార సమైఖ్య చైర్మన్‌ కొల్లు పెద్దిరాజు చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

Updated Date - Jul 11 , 2025 | 12:09 AM