కరోనాలోనూ.. పీక్కుతిన్నారు
ABN, Publish Date - May 10 , 2025 | 12:36 AM
2020–21 సంవత్సరాల్లో కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా పేరు వింటేనే జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోయేవారు.
దొంగ బిల్లులతో అధికారుల అవినీతి.. ఆడిట్‌లో ఇలా దొరికేశారు
భీమవరంలో అప్పటి మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై చర్యలకు సిఫారసు
క్రిమినల్ కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశం
తాడేపల్లిగూడెంలోనూ
అదే దందా.. వైసీపీ నేత అనుచరులకు కాంట్రాక్టులు
2020–21 సంవత్సరాల్లో కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా పేరు వింటేనే జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోయేవారు. ఈ రోజు ఎవరి నుంచి ఎలాంటి మరణవార్త వినాల్సి వస్తుందోనని హడలిపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసింది. కానీ కొందరు అధికారులు ఈ సొమ్మును పీక్కుతిన్నారు. ఇలాంటి వారంతా ఆడిట్‌లో దొరికిపోయి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
కరోనా సమయంలో జిల్లాలోని మున్సి పాలిటీల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు తో కొందరు అధికారులకు కలిసి వచ్చింది. కొవిడ్ బాధితులకు మాస్క్‌లు, వాటర్ బాటిళ్లు, భోజన వసతులు కల్పించారు. రెడ్‌జోన్‌లలో ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేశా రు. వీటికి మున్సిపాలిటీల్లో బిల్లులు చేసుకున్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లులోని టిడ్కో ఇళ్లల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తాడేపల్లిగూడెం కేంద్రానికి జిల్లా నలు మూలల నుంచి బాధితులను తీసుకు వచ్చి వైద్య సేవలందించారు. ఆ తర్వాత భీమవరం నిలిచింది. కొవిడ్ బాధితులకు అక్కడ ఆశ్రయం కల్పించారు. భీమవరం లో రాష్ట్ర ఫుడ్ అండ్ సేప్టీ శాఖ వాటర్ బాటిళ్లను సమకూర్చింది. వైద్య ఆరోగ్య శాఖ మాస్క్‌లు సరఫరా చేసింది. కాని, ఆ రెండు మున్సిపాలిటీ ఇచ్చినట్టు బిల్లులు చేసుకున్నారు. కాంట్రాక్టర్ జీఎస్టీలో నమో దు కాలేదు. ఫేక్ బిల్లులపై సంతకాలు చేసినట్టు ఆడిట్ అధికారులు నిగ్గు తేల్చా రు. మొత్తంపైన భీమవరం మున్సిపాలి టీలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమా ర్ సమయంలో రూ.1.40 కోట్లు చెల్లించా రు. అందులో అవకతవకలు జరిగాయని ఆడిట్ అధికారులు గుర్తించారు. అప్పట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. కానీ ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆడిట్ అధికారుల నివేదిక ఆధారంగా నిధులు దుర్వినియోగమైనట్లు తేల్చారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ రమేష్‌కుమార్ సహా ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రస్తుత కమిషనర్ గురువారమే ఫిర్యాదుచేశారు. అది స్పష్టత లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరోసారి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. అప్పట్లో మున్సిపాలిటీ నుంచి క్వారంటైన్ కేంద్రానికి బాధ్యత వహించిన సిబ్బందిపైన కేసులు నమోదు చేసేలా దిశా నిర్దేశం చేసింది.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం టిడ్కో ఇళ్లల్లో క్వారంటైన్ కేంద్రం నిర్వహించారు. రోజు వేలాది మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వారికి ఫ్యాన్‌లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అప్పటి వైసీపీ నేత ముఖ్య అనుచరుడికి జీఎస్టీ లైసెన్స్ లేకపోయినా కాంట్రాక్ట్ ఇచ్చి రూ.1.50 కోట్లు చెల్లించారు. రెడ్ జోన్‌ల పేరుతోనూ నిధులు వెచ్చించారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ కోవిడ్ పేరుతో నిధులు బొక్కేశారు. కానీ ఇక్కడ వైసీపీ నేత ఒత్తిడితో బయటకు రాకుండా సర్దుబాటు చేసుకున్నా రు. అయినా అప్పటి జిల్లా అధికారులు పెదవి విప్పలేదు.
కారులోనూ కక్కుర్తి
కొవిడ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన మహిళా కమిషనర్ హయాంలోనూ నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. కమిషనర్‌కు మున్సిపాలిటీ నుంచి కారు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అయితే కమిషనర్ ఇన్నోవా కారును సమకూర్చు కున్నారు. కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత రోజు కారు కొనుగోలు చేసినట్టు ఆడిట్‌లో గుర్తించారు. దానికితోడు ఆమె హయాంలో డీజిల్ వినియోగం పెరిగింది. అంతకుముందు సగటున నెలకు రూ.3.50 లక్షలు వెచ్చిస్తే, కమిషనర్ శ్యామల హయాంలో రూ.4.56 లక్షలకు పెరిగింది. దీనిని ప్రభుత్వం తప్పు పట్టింది. మొత్తంగా భీమవరం మున్సిపాలిటీలో గత ఐదేళ్లలో జరిగిన దందాపై అధికారులు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు.
Updated Date - May 10 , 2025 | 12:36 AM