తట్టా బుట్టా సర్దుకుని..
ABN, Publish Date - Jun 29 , 2025 | 11:48 PM
గతం లో వరదల సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల నేపథ్యంలో ముంపు మండలాల్లోని ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
వరద భయంతో పునరావాస కాలనీలకు తరలిపోతున్న ప్రజలు
పరిహారం అందని నిర్వాసితులు సమీప గ్రామాల్లో అద్దె ఇళ్లకు మొగ్గు
వేలేరుపాడు, జూన్ 29(ఆంధ్రజ్యోతి): గతం లో వరదల సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల నేపథ్యంలో ముంపు మండలాల్లోని ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. జూలై వస్తుందంటేనే ముంపు మండలాల ప్రజల గుండెల్లో గుబులు ప్రారంభమవుతుంది. గోదా వరికి వరదలు వచ్చే సమయం అసన్నమవు తుంది. ఏటా గోదావరి వరదల కారణంగా ఈ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. వరదల సమయంలోనే గ్రామాల్లోని ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అప్పటి కప్పుడు తరలిపోవాలంటే అవస్థలు పడుతున్నా రు. ఇళ్లలోని సామాన్లు పూర్తిగా తరలించే సమ యం ఉండకపోవడం వల్ల వరదలకు మునిగి పోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
మూడేళ్లుగా ఎంతో నష్టం
ఈ ప్రాంత ప్రజలు గత మూడేళ్లుగా వర దల కారణంగా ఎంతో నష్టపోయారు. 2022 జూలైలో వచ్చిన భారీ వరదల కారణంగా గ్రామా లకు గ్రామాలే నీటమునగా తీవ్ర ఆస్తి, పశు నష్టం సంభవించింది. అయా గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టకుని వెళ్లాల్సి వచ్చింది. గతేడాది జూలై, ఆగస్టు, సెప్టెంబరు మూడు నెలల పాటు గోదావరి వరదలు, పెదవాగు బీభత్సం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా గత చేదు అనుభవాల నేపథ్యంలో ప్రజలు ఈ ఏడాది ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇళ్ల ప్యాకేజీల సొమ్ములు జమ అయినవారు తమకు కేటాయించిన పునరావాస కాలనీలకు తరలిపోతుండగా ప్యాకేజీ అందని వారు సొంత భూములు ఉండి వ్యవసాయం చేసుకునేవారు మండలంలోని శివకాశీపురం, భూదేవిపేట, బండలబోరు, తదితర గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని ఈ మూడు నెలల పాటు ఆశ్రయం పొందేందుకు వీలుగా తమ ఇళ్లలోని సామగ్రిని తరలిస్తున్నారు.
గుట్టల మీద గుడిసెలు
గోదావరి వరదకారణంగా దారులు మూసు కుపోయే ప్రమాదం ఉన్న రుద్రమ్మకోట, రేపాక గొమ్ము, తాటుకూరుగొమ్ము, తిరుమలాపురం, నాళ్లవరం, చిగురుమామిడి గ్రామాల ప్రజలు కొన్ని రోజులుగా తమవస్తు సామగ్రితో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా రుద్ర మ్మకోట, మట్టిగట్ల, చిగురుమామిడి, కోయిదా గ్రామాల ప్రజలు సమీపంలోని గుట్టల మీద గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రానున్న మూడునెలలపాటు వీరికి కొండగుట్టలే ఆవా సం. రేపాకగొమ్ము గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు ఆదివారం పునరావాస కాలనీలకు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా తమ ఇళ్ల లోని సామగ్రిని తరలించారు.
తరలి వెళ్లాలంటూ ఒత్తిడి
ముంపు ప్రమా దం ఉన్న గ్రామాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి పునరావాస కాలనీలకు తరలివెళ్లాలంటూ నెల రోజుల నుంచి రెవెన్యూ, పోలీస్‌శాఖాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ముందుగానే తరలివెళ్తే పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తామని అప్పటికప్పుడు సహా యక చర్యలు చేపట్టాలంటే ఇబ్బంది అవుతుం దని వారు పేర్కొంటున్నారు. పోలవరం ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ ఇళ్లపరిహారం జమ అయిన నిర్వాసి తులు తరలిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి ఇంకా పరిహారాలు జమకానీ నిర్వా సితులు పునరావాస కానీలకు తరలివెళ్లేందుకు సుముకత వ్యక్తం చేయడంలేదు. ఈ ఏడాది జనవరిలో కొంతమంది ఖాతాల్లో పోలవరం పరిహారాలు జమ చేసిన ప్రభుత్వం మిగిలిన వారి విషయంలో ఆరునెలలు గడుస్తున్నా పరిహారాలు జమ చేసే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తాము ఇప్పుడు గ్రామాలను ఖాళీ చేసి వెళితే తమకు పరిహారం అందుతుదో లేదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఈ విషయంలో స్పష్టమైన హామీని ఇవ్వలేకపోతున్నారు. ఏది ఏమైనా రానున్న మూడు నెలల పాటు గోదావరి వరదల కారణంగా మండల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందన డంలో ఎలాంటి సందేహం లేదు.
Updated Date - Jun 29 , 2025 | 11:48 PM