వరద హెచ్చరిక
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:43 AM
గోదావరి వరద వచ్చే అవకాశం ఉందని, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు.
ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్ష
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తాటుకూరుగొమ్ము వద్ద గోదావరి ఉధృతి పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి
అధికారులతో సమీక్ష
తక్షణ చర్యలపై సూచనలు
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
వేలేరుపాడు, జూలై 8(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద వచ్చే అవకాశం ఉందని, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. వేలేరుపాడు మండలం తాటుకూరుగొమ్ము వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ముఖ్యంగా రైతులు, ప్రజలు పశువుల కాపరులు చేపలు పట్టేవారు నదిలోకి దిగవద్దని సూచించారు. తాటుకూరు గొమ్ము గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ఎంవీ.రమణ, తహసీల్దార్ డీవీ.సత్యనారాయణ,
ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయండి
ప్రస్తుత వర్షాకాలంలో తుఫాన్, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో వరదలకు చేపట్టాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళిక సమావేశం నిర్వహించారు. రానున్న మూడురోజుల్లో భద్రాచలం నుంచి గోదావరి వరద నీరు 9 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వచ్చే అవకాశం ఉందని, పెదవాగు, ఎద్దువాగుల నుంచి వేలేరుపాడు, కుక్కునూరు మండ లాలకు వరద ముప్పు పొంచి ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తరలించేందుకు అధికారులు సమాయత్తం కావాల న్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 43అడుగులకు చేరుకోక ముందే అధికారులు సహాయ చర్యలకు సిద్ధం కావాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నషా ్టలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ముంపు ప్రమాద ప్రాంతాల్లోని గర్భిణులు, పిల్ల లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, విభిన్న ప్రతిభా వంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చాలని వైద్యాధికారులను ఆదేశించారు.
రక్షణ చర్యలు ఇలా..
కోయిదా పరిసర గ్రామాల కొండ ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. గోదావరి తీర ప్రాంతంలో ముంపు గురయ్యే ప్రాంతాలను ముం దుగానే గుర్తించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వెంటనే ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అనువైన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఆ ప్రదేశాల్లో ప్రజలను ఉంచేందుకు తాత్కాలిక షెడ్లు, తాగునీరు, టాయిలెట్లు, సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పాడిపశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించి దాణా, నీరందించే చర్యలు తీసు కోవాలని పశుసంవర్థక శాఖాధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా కూలడానికి సిద్ధంగా ఉండి శిథిలా వస్థలో ఉన్న భవనాలు, బ్రిడ్జిలు, కల్వర్టులు, కాజ్‌వేలను గుర్తించి ముందుగానే మరమ్మతులు చేయించాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. గత వరదల సమ యంలో గండ్లు పడిన ప్రదేశాలను పరిశీలించి అవస రమైన చోట పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని గతంలో జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని అటువంటివి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకో వాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తుఫాన్లు, వరదల సమయంలో విద్యుత్ స్తంబాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుం డా చర్యలు తీసుకోవాలని అలాంటి అవసరమైన చోట జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని సమాచార వ్యవస్థ పని చేసే విధంగా సెల్ టవర్లు జనరేటర్లు ఏర్పాటు చేయాలని, సోలార్‌లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్‌శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు కలుషితం కాకుండా ప్రస్తుత తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటి పైపులైన్లు, డ్రెయినేజీ పైపులైన్లు కలవకుండా చూడాలని, మరమ్మతులకు గురైన చేతి పంపులను వెంటనే మరమ్మతు చేయించాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత గ్రామల్లో అత్యవసర సమయంలో పంపిణీ చేసేందుకు 3నెలలకు సరిపడ నిత్యవసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర సమయాల్లో ప్రజలను తరలించేందుకు వీలుగా పెద్దసంఖ్యలో బోట్లు సిద్ధం చేసుకోవాలని మత్స్యశాఖాధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఆర్డీవో రమణ, డీఆర్‌డీఏ పీడీ కే.విజయరాజు, ఇరిగేషన్ ఎస్‌ఈ నాగార్జునరావు, ఏపీవో అనురాధ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ త్రినాధబాబు, వ్యవసాయ శాఖ జేసీ హబీబ్ బాషా, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సాల్మన్‌రాజు, గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శ్రీహరి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రం పరిశీలన
కుక్కునూరు: గోదావరి వరద దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశిం చారు. దాచారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీని పంచాయతీ రాజ్, ఆర్‌డబ్య్లూఎస్, గృహ నిర్మాణ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదు పాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
Updated Date - Jul 09 , 2025 | 12:43 AM