ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి అడుగు.. అదుర్స్‌

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:44 AM

తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సంద ర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట బుధవారం నుంచి వినూత్న కార్యక్రమం తలపెట్టారు. తెలుగుదేశం శ్రేణు లు ఊరూ, వాడా ఇంటి ముంగిట వాలారు. ఏడాది పొడవునా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు.

పెదవేగిలో కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ మహేశ్‌, ఎమ్మెల్యే చింతమనేని

మంత్రి, ఎంపీ, నేతలకు ప్రజల స్వాగతం

ఉత్సాహంగా పార్టీ కేడర్‌

అన్నిచోట్ల అనూహ్య స్పందన

వ ర్షం పడుతున్నా తొలి అడుగులో అడుగేసిన జనం

చేసింది నచ్చిందా.. ఎమ్మెల్యేల ఆరా

ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు

పాలన బాగుందంటూ జనం కితాబు

తొలిరోజే జిల్లాలో కలియతిరిగిన టీడీపీ శ్రేణులు

ఎలా ఉన్నారు.. పింఛన్‌ పెంచి ఇస్తున్నాం కదా. సంతృప్తిగా ఉందా..?

తల్లికివందనం మీకు అందిందా. ఎంత మంది పిల్లలున్నా ఇచ్చిన మాటకు నిలబడి మీ ఖాతాల్లో వేశాం. మీరు పిల్లలు సంతోషంగా ఉన్నారా..?

ఊళ్లోకి రావాలంటే గతంలో రోడ్డంతా గోతులే. ఇప్పుడవి లేవు కదా, ధాన్యం డబ్బులు ఇంతకు ముందు నెలలు తరబడి పెండింగ్‌. ఇప్పుడా పరిస్థితి లేదుగా..?

ఊళ్లో అవసరాలు ఇంకేం కావాలి.

మీరు అడగండి.. మేం ఇస్తాం.. కూటమి ప్రభుత్వం మీది స్వేచ్ఛగా ఉండండి. ప్రభుత్వానికి మద్దతివ్వండి. ఏదైనా కావాలంటే భయం లేకుండా అడగండి. కొద్దిగా ఆర్థికంగా స్థిమితపడిన తర్వాత అన్ని పనులు పూర్తి అవుతాయి. సుపరిపాలనలో ఏడాది పేరిట ఇంటింటికి వెళ్లినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికులను ఇలా పలకరించారు..

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సంద ర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట బుధవారం నుంచి వినూత్న కార్యక్రమం తలపెట్టారు. తెలుగుదేశం శ్రేణు లు ఊరూ, వాడా ఇంటి ముంగిట వాలారు. ఏడాది పొడవునా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏం అవస రాలున్నాయని ఆరా తీశారు. అవి కూడా చేస్తామంటూ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలతో పాటు కూటమి ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ కన్వీనర్లే తొలి అడుగుకు మార్గదర్శకం చేశారు.

మంత్రి, నేతలకు ప్రజల స్వాగతం

మంత్రి పార్థసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గం సీతారామపురంతో సహా మరికొన్ని గ్రామాలకు వచ్చిన టీడీపీ నేతలకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. మంత్రితో సహా మిగతా నేతలు తరలిరావడమే కాకుండా పేదల ఇళ్లకు వెళ్లి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చాలా సందర్భాల్లో తమకు పింఛను పెంచి ఇవ్వడం సంతోషం గా ఉందని, మందులు ఇతరత్రా ఖర్చులకు ఇప్పుడు పరాయి వాళ్లను చేయిచాచి అడగాల్సిన పనిలేదని పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలను ఒక్కొక్క టిగా తొలగిస్తూ మీరు మెచ్చే విధంగా పాలన చేస్తున్నామా? లేదా అంటూ స్థానికుల నుంచి మంత్రి సమాధానాలు రాబ ట్టారు. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదవర్గాల కోసం ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, ఇవికాక రాబోయే నెలరోజుల్లో మరిన్ని పథకాలు మీకు అందబోతున్నాయని స్ధానికులకు వివరించే ప్రయత్నం చేశారు. గతం కంటే భిన్నం గా తొలి అడుగు కార్యక్రమంలో ఊరూరా జనం తరలివచ్చారు. నేతలు తమ ఇళ్లకు వచ్చి ఆప్యాయంగా పలకరించడం సంతృప్తికరంగా ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల్లో కదిలిన శ్రేణులు

జిల్లావ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట పార్టీ శ్రేణులన్నీ ఉత్సాహంగా కదిలాయి. దెందులూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వినూత్నంగా తొలి అడుగేశారు. నియోజకవర్గం నుంచి వందలాది మంది లక్ష్మీ పురం మార్కెట్‌ యార్డుకు తరలివచ్చారు. తొలి అడుగు కార్య క్రమం విజయవంతం చేసేందుకు ముఖ్యనేతలు, కార్యకర్తలు కూడా తరలివచ్చారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ అందరినీ ఆకట్టుకునేలా ప్రసం గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నేత అని పేద వర్గాలను ఆదుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ ఏడాదిలో ప్రజలకు చేసిన మేలును ప్రభాకర్‌, పుట్టా వివరించారు. ఏలూరు నియోజకవర్గంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు ఎంపీ మహేశ్‌ కుమార్‌, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనే యులు, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పాల్గొన్నారు. నగర పరిధిలో ప్రజలను కలుసుకున్నప్పుడు.. ఏడాదిలో మార్పు చూపించారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాం. పింఛన్‌ దగ్గర నుంచి తల్లికి వంద నం వరకు అంతా భేష్‌. బస్సులో కూడా ఉచిత ప్రయాణం అంటున్నారు.. ఇంతకంటే సంతోషం ఏమీ ఉంటుంది అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో నేతలు ఉబ్బిత బ్బిబయ్యారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోషన్‌ కుమార్‌ అందుబాటులో లేకపోయినా ఆయనకు బదులుగా స్థానిక నాయకులే కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు.

ఆ మూడు చోట్ల సక్సెస్‌

జనసేన ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పోలవరం, ఉంగుటూరు, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరులో టీడీపీ కన్వీనర్లు కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఉంగుటూరులో ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాం జనేయులు భీమడోలు, గణపవరం మండలాల్లో ఇంటింటికి వెళ్లి ఏడాది విజయాలను వివరించారు. బుట్టాయగూడెం లో పోలవరం టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, కైకలూరు లో టీడీపీ కన్వీనర్‌ అచ్యుతరావు పార్టీ శ్రేణులను వెంట బెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిరోజే తొలి అడుగు కార్యక్రమానికి అనూహ్య ప్రజామద్దతు దక్కడంతో టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 03 , 2025 | 12:44 AM