సుపరిపాలనలో తొలి అడుగు!
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:38 AM
ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఇంత స్వల్ప వ్యవధిలోనే ఆర్థికంగా లోటు పాట్లను సవరించడమే కాకుండా ప్రజాసంక్షేమం వైపు వేగంగా అడుగులు వేశారు.
ఏడాది కూటమి విజయాలపై ప్రచారం.. ఉమ్మడిగా జనం వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
నియోజకవర్గాల వారీగా ఇప్పటికే కార్యాచరణ
చేసింది చెప్పడం.. ప్రజలను మెప్పించడమే విధి
అందరూ పాల్గొనాల్సిందే : గన్ని వీరాంజనేయులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఇంత స్వల్ప వ్యవధిలోనే ఆర్థికంగా లోటు పాట్లను సవరించడమే కాకుండా ప్రజాసంక్షేమం వైపు వేగంగా అడుగులు వేశారు. జిల్లావ్యాప్తంగా ప్రతీ నెల ఠంఛన్‌గా కోట్లాది రూపాయలు పేదవర్గాలకు అందిస్తున్నా రు. ఎన్నికల హామీలో భాగంగా నాలుగువేలకు పెంచి మరీ పంపిణీ చేస్తున్నారు. తొలుత సచివాలయ సిబ్బంది లేకుండా.. ఇది సాధ్యమా అనే ప్రశ్న తలెత్తినా వేకువ జామునే పింఛన్ల పంపిణీ ప్రారంభించడం ద్వారా ప్రజల్లో తొలి మైలురాయిని అధిగమించారు. పేదవర్గాలకు రాష్ట్రం లో పంపిణీ చేస్తున్నంత పింఛన్ దేశంలో మరెక్కడ లేదన్న విషయాన్ని గడపగడపకూ వెళ్లి అర్థమయ్యే రీతిలో వివ రించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రత్యేకించి ఏడాది లోపే సుపరిపాలన అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్ర బాబు చూపిన చొరవ, కూటమిలో మిగతా పక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ ఒకేమాట– ఒకేబాట అనేలా పాలన సాగిన విషయాన్ని విస్తృత ప్రచారం చేయాలని భావిస్తు న్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి ‘సుపరిపాలనలో ఏడాది..గడపగడపకూ టీడీపీ’ పేరిట పార్టీశ్రేణులన్నీ కది లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, కన్వీనర్లు పార్టీశ్రేణులను సమాయత్త పరుస్తూనే, గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన నష్టంతో పాటు ఏడాది కాలంలోనూ ప్రజలుమెచ్చిన పాలన అందించామని గణాంకాలతో అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఏడాదిలో రెట్టింపు సంక్షే మం ఎలా సాగిందో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 149కి పైగా హామీలను వివిధ నియోజకవర్గాల్లో ఎలా అమలు చేశామో కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
పోలవరం దగ్గర్నుంచి ..
ఏడాది కాలంలో ప్రాధాన్యత పరంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు మిగతా హామీల విషయంలో కేంద్ర సహకారంతో ఎలా ముందడుగు వేశారో జిల్లావ్యాప్తంగా వివరించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. పోల వరం ప్రాజెక్టు వైసీపీ హయాంలో మూలన పడగా, రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేయ డానికి ఎలాంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామో రైతులకు పక్కాగా వివరించబోతున్నారు. పోలవరం ప్రాజె క్టు నిర్మాణంలో త్యాగాలు చేసిన కుటుంబాలకు ఈ ఏడాది లోనే పరిహారం చెల్లించిన విషయాన్ని గుర్తుచేస్తూ అడు గులు వేయాలని పార్టీ ఇప్పటికే సూచించింది. అత్యధిక కుటుంబాలకు మేలు చేకూర్చేలా తల్లికి వందనం కింద గతంలో ఒక్కరికే రూ.15 వేలు చెల్లిస్తే, ఇప్పుడు ఇద్దరికి మించి పిల్లలున్న వారందరికి రూ.30 నుంచి 60వేల వరకు తల్లి ఖాతాలో జమ చేసిన విషయానికి ప్రాధాన్యత ఇవ్వ బోతున్నారు. పట్టణప్రాంతాల్లో చెత్తపన్ను రద్దు చేయడం, పేదల కోసం అన్నక్యాంటీన్లను ప్రారంభిం చడం, నెలవారీ పింఛన్‌ను రూ.నాలుగువేలకు పెంచడం, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే జీవో 117 రద్దు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం, మెగా డీఎస్సీ, ఒంటరి మహిళలకు పింఛన్లు, డ్వాక్రాసంఘాల్లో రుణవితరణలో ప్రాధాన్యత వంటి అంశాలతో పాటు ఉచితగ్యాస్ పథకమే కాకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు అండగా నిల వడం, ఆగస్టు నుంచి మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు అడుగులు వేస్తున్నారు. మంత్రి పార్థసారథి, సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, రోషన్ కుమార్, పార్టీ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ తొలి అడుగుకి తమ,తమ నియోజకవర్గాల్లో సిద్ధం అయ్యారు.
అందరూ పాల్గొనాల్సిందే:
గన్ని వీరాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
సుపరిపాలన తొలి అడుగు పేరిట బుధవారం నుంచి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు, నేతలు, వివిధ హోదాల్లో ఉన్నవారంతా గడపగడపకూ వెళ్లాల్సిందే. ఏడాది పాటు సాధించిన సంక్షేమ విజయాలను వివరించాలి. ఒకటికి రెండుసార్లు అర్థమయ్యే రీతిలో క్షేత్రస్థాయిలో స్థానికులకు వివరించాలి. సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు ప్రజా సంక్షేమం కోసం ఎలా అహర్నిశలు కష్టపడిందీ అర్థమయ్యేలా చెప్పాలి. ఇదేతరుణంలో గత ఐదేళ్లపాటు వైసీపీ దుర్మార్గాన్ని మరోసారి గుర్తుచేయాలి.
75 శాతం హామీలు నెరవేర్చాం : మంత్రి సారథి
నూజివీడు: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభంకానుందని, టీడీపీ శ్రేణులు ప్రతీ ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలకు వివరించాలని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కార్యకర్తలకు దిశా నిర్ద్ధేశం చేశారు. స్థానిక రోటరీ క్లబ్ ఆడిటోరియంలో మంగళవారం నియోజవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో జరిగిన విధ్వంస పాలన నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తోందన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 75 శాతం హామీలను నెరవేర్చిందన్నారు. కూటమి మిత్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
Updated Date - Jul 02 , 2025 | 12:38 AM