ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జనం చెంతకు.. తొలి అడుగు

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:32 AM

తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది విజయాలను ప్రజలకు వివరిస్తూ వారి మన్ననలను పొందడమే కాకుండా స్థానిక సమస్యలపైన స్పందించేం దుకు తొలి అడుగు వేసి మూడు వారాలైంది.

ఏలూరులో తొలిఅడుగు కార్యక్రమంలో సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటి

మూడు వారాల్లో కొన్నిచోట్ల భారీగా చొరవ

దెందులూరు,ఏలూరు,నూజివీడుల్లో టాప్‌

ప్రజల మధ్యకు ఎమ్మెల్యేలు, నేతలు

రోజూవారీ సమీక్షిస్తున్న తెలుగుదేశం నాయకత్వం

స్థానిక సమస్యలతో పాటు పెండింగ్‌ పైన జనం ప్రస్తావన

తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది విజయాలను ప్రజలకు వివరిస్తూ వారి మన్ననలను పొందడమే కాకుండా స్థానిక సమస్యలపైన స్పందించేం దుకు తొలి అడుగు వేసి మూడు వారా లైంది. సూపర్‌సిక్స్‌తో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించి ప్రజాపాలన వైపు సాగిన తీరును ఊరూ,వాడా వివరించేం దుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట పార్టీ యంత్రాంగం జనం మధ్యకు చేరింది. కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్త దగ్గర్నుంచి ఎమ్మెల్యే వరకు చెమటోడ్చారు. ప్రభుత్వంలో భాగస్వామ్యులైన జనసేన, బీజెపీ ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాల్లోను మండలస్థాయి నేతలు తొలి అడుగు విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతిప్రతినిధి)

ఏడాది పాలనలో ఎన్నో మార్పులు, చేర్పులు. ప్రజలు మెచ్చేలా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చెమటోడ్చుతున్నారు. మరికొన్ని చోట్ల పార్టీ నేతలే అన్నీతామై కరపత్రాలతో సహా గడపగడపకూ వెళు తున్నారు. గడిచిన ఏడాది కాలంలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ, ఇప్పటివరకు చేసిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను వారి ఎదుట ఏక రవు పెట్టడమే కాకుండా ప్రజలను తప్పుదారి పట్టిం చేలా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో కొంత సక్సెస్‌ అయ్యారు. పౌరసరఫరాల విభాగంలో ఇంటింటికి రేషన్‌ కింద ఇన్నాళ్లు కొనసాగిన వ్యవస్థను తప్పించి పాత పద్ధతిలోనే డీలర్ల ద్వారానే రేషన్‌ అందించే విధానాన్ని ప్రజలకు వివరిస్తున్నప్పుడు అత్య ధికులు ఈ పద్ధతినే స్వాగతిస్తున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన లోపాలను తెలుగు దేశం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను వివరిస్తున్న ప్పుడు ప్రజాసానుకూలతే కనిపిస్తున్నట్టు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రత్యేకించి గతంలో ఒకవర్గం వైసీపీ ముసుగేసుకుని మరీ ఏకపక్షంగా వ్యవహరించిన విధానాన్ని గ్రామీణప్రాంతాల్లో అత్యధికులు బహి రంగంగా వ్యాఖ్యలు చేయడంతో గడపగడపకూ వెళుతున్న పార్టీశ్రేణులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంకోవైపు పింఛన్లు, రేషన్‌లతో పాటు తల్లికి వందనం కింద సంతృప్తికరంగా బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయని కొందరు హర్షామోదాలు వ్యక్తం చేస్తుండగా, అన్నదాత సుఖీభవ కింద ఇంకా నగదు జమ కాకపోవడం తొలి అడుగులో ప్రస్తావనకు వస్తోంది. పనిలోపనిగా లిక్కర్‌ స్కాంను టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నప్పుడు తాగు బోతులనే ముద్రవేసి కొంప కొల్లేరు చేశారని, ఏది పడితే ఆ ‘మందు’ ఎక్కువగా అమ్మి జేబులో వేసుకు న్నారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నారని కామెంట్లు వినిపించడం విశేషం. దీనికి తోడు వితంతు పింఛన్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడం ముఖ్యమంత్రి స్వయంగా తేదీలు ప్రకటించినా ఇప్పటికీ అమలు కాకపోవడాన్ని స్థానికులు ప్రస్తావిస్తున్నారు. ఇక మర మ్మతులకు నోచుకోని రోడ్లు, నిర్మాణంలో అర్ధాతరంగా నిలిచిన పక్కా ఇళ్ల గురించి జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం నిమిత్తం రూ.33 వేలు చెల్లించామని, ఇప్పుడు ఆ సొమ్ము వెనక్కి ఇవ్వకపోగా నిర్మాణం చేయకుండా చేతులెత్తేశారని ఆగ్రహం అక్కడక్కడ కనిపిస్తోంది. టిడ్కో ఇళ్లు విషయాన్ని, కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లలో సవరణలు, భూ వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావట్లేదని, ఏదొక వంక చూపించి అధికారులు దాటవేత ధోరణి అవలం భిస్తున్నారని కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు.

మంచి మార్కుల కోసం..

తెలుగుదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు సాధ్యమైనంత మేర ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి సమాంతరంగా దెందులూరు సీనియర్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోటాపోటీగా ఊరూరా తిరుగు తున్నారు. ఆరంభం నుంచి ఇప్పటివరకు ఎక్కడా గ్యాప్‌ లేకుండా నిత్యం ఎంపిక చేసిన గ్రామాల వైపు తొలి అడుగు వేస్తున్నారు. స్థానికులతో మమేకం అవుతున్నారు. ఏలూరు నగరంలో డివిజన్ల వారీగా బాధ్యులను వెంటబెట్టుకుని ప్రజాక్షేత్రం వైపు ఎమ్మెల్యే బడేటి చంటి అడుగులు వేస్తున్నారు. ప్రజలకు చేరు వగా వెళ్లటం, వారి మంచి చెడ్డలను అడిగి తెలుసు కోవడం, స్థానిక సమస్యలను కొద్దిరోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. దెందులూరు తొలి అడుగు కార్యక్రమం ఒక పండుగలా సాగుతోంది. ఎమ్మెల్యే ప్రభాకర్‌ తనదైన శైలిలో ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సాధ్య మైనంత మేర అధికారుల నుంచి సమాచారం రాబట్టి ఆయా సమస్యలను ఎప్పటిలోగా పూర్తి చేయ గలుగుతామో భరోసా ఇస్తున్నారు. స్థానికులతో కలిసి పోవడం ఒక ఎత్తైయితే చొరవ తీసుకుని దూకుడుగా ముందుకు వెళ్లడంలో సీనియర్‌గా ప్రభాకర్‌ సక్సెస్‌ అయ్యారు. మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ తొలి అడు గులో పాల్గొన్నారు. ఆయన పర్యటించడానికి కుదరని పక్షంలో పార్టీ నేతలే దగ్గరుండీ మరీ ఆయా గ్రామాల్లో సుపరిపాలన గురించి వివరిస్తున్నారు. చింతలపూడి నియోజక వర్గంలో ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ తొలి అడుగు ఆరంభంలో అందుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నా రు. స్థానిక నేతలను కలుపుకుని పోయి ఇంటింటికి తిరుగుతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక కేడర్‌తో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ పరిశీలకులు, క్లస్టర్‌ ఇన్‌చార్జులు, యూనిట్‌ ఇన్‌చార్జులు బాధ్యత తీసుకుని గడపగడపకూ వెళుతున్నారు. దీనికి తోడు ఏ రోజుకారోజు కార్యక్రమం అమలు చేస్తున్న తీరు, పాల్గొంటున్న నేతల వివరాలను అధినాయకత్వానికి నివేదిస్తున్నారు. జిల్లాలో పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వివిధ నియో జకవర్గాలను సమన్వయం చేస్తూనే, ఆయన స్వయంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తొలి అడుగులో పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:32 AM