గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి పొలాలకు దారివ్వాలి
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:21 AM
మండలంలోని పుట్లగట్లగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు.
జంగారెడ్డిగూడెం,జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పుట్లగట్లగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. రహదారిపై టెంట్ వేసి రాస్తారోకో నిర్వహించారు. హైవే రోడ్డు పనులు పూర్తయిన తర్వాత పొలాలకు వెళ్లే రహదారి నిర్మించి ఇస్తామని చెప్పిన అఽధికా రులు ఇప్పుడు దారి మూసివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు దుక్కి దున్ని వరినాట్లు వేసే సమయం కావడంతో పొలాల్లోకి వెళ్లడా నికి దారిలేక ఇబ్బందులు పడుతున్నట్లు మాజీ జడ్పీటీసీ, రైతు శీలం రామ చంద్రరావు, వైసీపీ మండల అధ్యక్షుడు, రైతు వామిశెట్టి హరిబాబు తెలిపారు. గత మూడేళ్లుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వినతులు సమర్పిస్తున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. వరద నీరు, కొంగలచెరువు నుంచి వచ్చే వరద నీరు వెళ్లే దారి కూడా మూసివేయడంతో పంటలను ముంచి వేస్తున్నాయని రైతులు తెలిపారు. ఎంపీ పుట్టా మహేశ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. రైతుల రాస్తారోకో కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో రైతులు గొల్లపూడి శ్రీనివాసరావు, శీలం వెంకటరాజు, బొచ్చు శ్రీను, పళ్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:21 AM