ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోకో గింజలు కొనుగోలు చేయాలి

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:19 AM

రైతుల దగ్గర నిల్వ ఉన్న కోకో గింజలను పూర్తిగా కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని కోకో రైతు సంఘం విజ్ఞప్తి చేసింది.

విజయరాయిలో ఆందోళన చేస్తున్న కోకో రైతులు

పెదవేగి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రైతుల దగ్గర నిల్వ ఉన్న కోకో గింజలను పూర్తిగా కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని కోకో రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కోకో గింజలకు ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విజయరాయిలో శుక్రవారం కోకో రైతులు సమావేశమై కోకో గింజల కొనుగోలుపై నిరసన వ్యక్తంచేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు కంపెనీలు రైతుల దగ్గర నుంచి గింజలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా ఇబ్బం దులకు గురి చేస్తున్నాయన్నారు. రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసు కోవడంలేదని, వచ్చేనెల 15 వరకు ప్రభుత్వం అందిస్తున్న రూ.50 ప్రోత్సాహ కంతో కిలో రూ.500 చెల్లించి కొనుగోలు చేసేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం పెదవేగి పామాయిల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయిల్‌పామ్‌ రైతులు చేస్తున్న పోరాటానికి కోకో రైతు సంఘం తరపున సంఘీ భావం తెలిపారు. పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆలోచనను విరమిం చుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది. కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం నాయకుడు పాలడుగు నరసింహారావు, రైతులు గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్‌బాబు, రాపర్ల తేజకృష్ణ, ఆలపాటి వాసు, వై.శ్రీనివాసరావు, బొప్పన మునీశ్వరరావు, బింగి శ్రీను, పావులూరి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కోకో విక్రయ రైతులు దరఖాస్తు చేసుకోండి

ఏలూరు సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రాయితీ ద్వారా కోకో విక్రయించే రైతులు ఈనెల 30లోగా ఉద్యాన శాఖకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖాఽధికారి ఎస్‌.రామ్మోహన్‌ శుక్రవారం తెలిపారు. కేజీకి రూ.50 చొప్పున ప్రభుత్వ రాయితీతో కేజీ రూ.500 ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిందన్నారు. కోకో రైతులు ఉద్యావన శాఖ వద్ద పేర్లను నమో దు చేసుకుంటే కంపెనీ వారికి విక్రయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1536 మెట్రిక్‌ టన్నుల కోకో గింజలను మొండోలైజ్‌, డీపీ, చాకొ లేట్‌, ఇతరుల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతులంతా ఈనెల 30లోపు రైతు సేవా కేంద్రాలలో పర్మిట్స్‌ తీసుకుని సమీపంలో గల కంపెనీలకు విక్రయించుకోవచ్చని ఉద్యావన శాఖాధికారి రామ్మోహన్‌ సూచించారు.

Updated Date - Jun 28 , 2025 | 12:19 AM