ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెడ్‌క్రాస్‌ సేవలు విస్తృతం చేయాలి : కలెక్టర్‌ వెట్రిసెల్వి

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:13 AM

రెడ్‌క్రాస్‌ సేవలు విస్తృంగా చేయాలని, ప్రస్తుతం రెడ్‌క్రాస్‌ వద్ద ఉన్న రెండు డయాలసిస్‌ మిషన్లకు అదనంగా మరో రెండు డయాలసిస్‌ మిషన్లతో డయాలసిస్‌ సెంటర్‌ను త్వరగా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి సూచించారు.

ఏలూరు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం

ఏలూరు క్రైం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రెడ్‌క్రాస్‌ సేవలు విస్తృంగా చేయాలని, ప్రస్తుతం రెడ్‌క్రాస్‌ వద్ద ఉన్న రెండు డయాలసిస్‌ మిషన్లకు అదనంగా మరో రెండు డయాలసిస్‌ మిషన్లతో డయాలసిస్‌ సెంటర్‌ను త్వరగా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి సూచించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ చైౖర్మన్‌ డాక్టర్‌ ఎంబీఎస్వీ ప్రసాద్‌, కార్యవర్గ కమిటీ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ కె.వెట్రిసెవ్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై చర్చించిన అనంతరం కార్యవర్గానికి ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాయ్‌హాన్‌ కాఫీ లిమిటెడ్‌ వారు అందిస్తామన్న మరో రెండు మిషన్లతో రక్త యూనిట్ల నిల్వలను పెంచి రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ కేంద్రంలో నాణ్యమైన, సురక్షితమైన రక్తాన్ని అవసరమైన ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీని సేవా కార్యక్రమాలలో ప్రథమ స్థానంలో ఉండేలా కమిటీ సభ్యులు అందరూ సమష్టి కృషి చేయాలని, అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.

‘రెడ్‌క్రాస్‌’లో యోగాంధ్ర మాసోత్సవాలు

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ తలసీమియా భవనంలో యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్‌ చైౖర్మన్‌ డాక్టర్‌ ఎంబీఎస్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రెసిడెంట్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కె.వెట్రిసెల్వి ఆదేశాలతో జూన్‌ 21 ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని రెడ్‌క్రాస్‌ భవనంలో జూన్‌ 21 వరకు ఉదయం ఏడు నుంచి 8 గంటల వరకు యోగా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్‌ వలంటీర్లు, నర్సింగ్‌ విద్యార్థినులు, మానవత సభ్యులు యోగ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. అనంతరం యోగా గురువులు మైలవరపు లక్ష్మీనరసింహం, ఎం.మల్లికార్జునరావు మాట్లాడారు.

Updated Date - Jun 04 , 2025 | 12:13 AM