తల్లికి వందనానికి విద్యుత్ షాక్
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:56 AM
తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే.. అందరికి వారి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున ఈ నెల 12న ప్రభుత్వం జమ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల కొందరు అనర్హుల జాబి తాలో వున్నారు.
సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
తణుకు రూరల్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే.. అందరికి వారి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున ఈ నెల 12న ప్రభుత్వం జమ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల కొందరు అనర్హుల జాబి తాలో వున్నారు. ఇలాంటి వారంతా తమకు సొమ్ములు ఎందుకు రాలేదో చెప్పాలని సమీప సచివాలయాల వద్దకు వెళ్లి సంబంధిత అధికా రులను ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం లబ్ధి పొం దాలంటే ఇంటి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించకూడదనే నిబంధన వుంది. చాలా మంది లబ్ధిదారులు విద్యుత్ బిల్లుల కారణంగా తమకు సొమ్ములు అందలేదని తెలుసుకుని సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి బిల్లులు సరిచూసుకుంటున్నారు. మూడు రోజులుగా తణుకు మండలం తేతలి సబ్‌స్టేషన్ వద్దకు క్యూ కడుతున్నారు. రికార్డులు పరిశీలించిన అధికారులు కొందరికి బిల్లులో ఉన్న యూని ట్లకంటే తక్కువ, ఎక్కువ వినియోగించినట్లు గుర్తించారు.
సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ఆకివీడు, జూన్ 16(ఆంధ్రజ్యోతి):భూమి లేకున్నా ఉన్నట్లు చూపించడం, ఇంటిల్లిపాది సపరేటు రేషన్ కార్డులున్నా, హౌస్‌హోల్డ్ పద్ధతిలో కలిసి ఉన్నట్లు చూపడంతో చాలా మంది అర్హులు అనర్హులుగా మిగిలిపోయారు. వారం తా సచివాలయాల వద్దకు క్యూ కట్టి తమనెం దుకు అనర్హులుగా మిగిల్చారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సోమవారం ఆకివీడు సచివాలయాలకు బాధితులు క్యూకట్టారు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో సమాధానం చెప్పేవారు కరువవడంతో ఆగ్రహించారు. బ్యాంకుల ఖాతాలో పడ్డాయేమోనని అక్కడ కు వెళ్లడంతో రద్దీగా కనబడ్డాయి. బాధితులు వార్డుల్లో ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు.
మీటరు లేకున్నా 300 యూనిట్లు
వీరభద్రపురానికి చెందిన నాకు ఇల్లు వున్నా నా పేరున అసలు విద్యుత్ మీటరే లేదు. అయితే నా విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువగా వుందని చూపించారు. అందుకే నలుగురు పిల్లల్లో ముగ్గురు స్కూళ్లకు వెళుతున్నా తల్లికి వందనం సొమ్ములు రాలేదు.
– ఖండవల్లి దిలీప్, వీరభద్రపురం
300 యూనిట్లు రాకపోయినా...
ఏడాది క్రితం కొత్త విద్యు త్ మీటర్ ఏర్పాటు చేశారు. ఏ నెలలోను 300 యూని ట్లు వినియోగించినట్లు బిల్లులు రాలేదు. అయితే తల్లికి వందనం పథకంలో మాత్రం నెలకు 300 యూనిట్లపైనే విద్యుత్ వినియోగం వలన పథకంలో సొమ్ములు రాలేదని చూపుతున్నారు.
–కర్రి యేసు, వేల్పూరు
222 యూనిట్లు వచ్చినా
నాకు విద్యుత్ బిల్లులు ఏ నెలలోనూ 200 యూనిట్లు పెరగలేదు. ఈ ఏడాది మే లో 222 యూనిట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ కారణం గా నా ఇద్దరు పిల్లలకు సంబంధించిన తల్లికి వందనం సొమ్ములు అందలేదు.
– తానేటి మధుషీలా, పైడిపర్రు
Updated Date - Jun 17 , 2025 | 12:56 AM