ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోవిందా.. గోవింద

ABN, Publish Date - Jun 16 , 2025 | 12:09 AM

చిన్నతిరుమ లేశుని దివ్యసన్నిధి ఆదివారం భక్తజనులతో నిండిపోయింది. సెలవురోజు కావడంతో ఆలయానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

భక్తులతో నిండిన వైకుంఠ ం క్యూకాంప్లెక్స్‌

శ్రీవారి సన్నిధిలో భక్తులు కిటకిట

ద్వారకాతిరుమల, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): చిన్నతిరుమ లేశుని దివ్యసన్నిధి ఆదివారం భక్తజనులతో నిండిపోయింది. సెలవురోజు కావడంతో ఆలయానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయంలోని అన్ని విభాగాలు కిటకిటలాడాయి. గోవిందా.. గోవింద అంటూ శ్రీవారి నామస్మరణ మార్మోగింది. దాదాపు 15వేలకు పైబడి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించినట్టు ఆలయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఉచిత తీర్థ,ప్రసాదాలు, ఆ తరువాత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

27 నుంచి జగన్నాథుని రథోత్సవాలు

ద్వారకాతిరుమల : శతాబ్ధకాలం నాటి పురాతన చరిత్ర గల లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాఽథ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి వచ్చే నెల 6 వరకు జగన్నాథుని రథోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి తెలిపారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను పూరి క్షేత్రంలో మాదిరిగా ఇక్కడ శ్రీవారి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు పూరి క్షేత్రం నుంచి తెచ్చిన సుభద్ర, బలభద్ర, జగన్నాధుల దారు విగ్రహాలు ఉత్సవక్రతువులో ప్రధాన ఆకర్షణగా నిలుస్థాయి. జగన్నాథ రఽథోత్సవాల్లో భాగంగా ఈనెల 27న రథ వాహనంపై స్వామివారు లక్ష్మీపురం ఆలయం నుంచి సాయంత్రం ఐదు గంటలకు శ్రీవారి క్షేత్రానికి ఊరేగింపుగా వస్తారు. ఉత్సవాల ముగింపు రోజైన వచ్చేనెల ఆరో తేదీన ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురానికి సాయంత్రం ఐదు గంటలకు రథయాత్రగా వెళ్లనున్నారు. ఈ ఉత్సవాలను దర్శించి భక్తులు తరించాలని ఆయన కోరారు.

Updated Date - Jun 16 , 2025 | 12:09 AM