ప్రాధాన్యతలను గుర్తించండి
ABN, Publish Date - May 20 , 2025 | 12:47 AM
వేసవి పూర్తై వర్షాకాలం సమీస్తుండగా ఆ మేరకు అన్ని విభాగాల్లోను అప్రమత్తత నెలకొనాలని, త్వరిత గతిన నిర్ణయాలను తీసుకోవాలని, వ్యవసాయ సంబంధ అంశాలే కాకుండా, విద్యా, వైద్య తదితర అంశాలపై ప్రాధాన్యత కల్పించాలని ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధి వైపు ముందడుగు వేయండి..
ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించండి
సాగు దగ్గర్నుంచి విద్య వరకు ముఖ్యమే
అందరి సహకారంతో మరింత అభివృద్ధి
జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
వేసవి పూర్తై వర్షాకాలం సమీస్తుండగా ఆ మేరకు అన్ని విభాగాల్లోను అప్రమత్తత నెలకొనాలని, త్వరిత గతిన నిర్ణయాలను తీసుకోవాలని, వ్యవసాయ సంబంధ అంశాలే కాకుండా, విద్యా, వైద్య తదితర అంశాలపై ప్రాధాన్యత కల్పించాలని ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్ణం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. కాలువ ల్లో పూడిక తీత, ఉపాధి హామీ, తాగునీటి సరఫరా, రెవెన్యూ, విద్యా, ఉద్యానవన విభాగాలపై మంత్రి ప్రత్యే కించి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. సాగునీటి వనరులకు సంబంధించి పనులన్నీ పూర్తి చేయాలి. ఎక్కడ నీటి ప్రవాహానికి ఇబ్బందులేర్పడం, రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాఽధ్యత యంత్రాంగంపైనే ఉంది. రుతు పవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలువలు, చెరువుల్లో తూడు, పూడికతీత పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి. మైనర్ ఇరి గేషన్ పనులు తక్షణం పూర్తి చేయాలి. ఉపాధి హామీ పఽథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో 50 రోజుల్లోనే 31.71 లక్షల పనిదినాలు కల్పించాం. వచ్చే నెల 15లోపు 65 శాతం పూర్తి చేయాల్సిందే. ఆయిల్‌ఫామ్ విస్తరణకు ఎన్నో అవకాశాలున్నాయి. రైతుల్లో మరింత చైతన్యం పెంచాలి. ప్రభుత్వ స్కూల్స్‌లో ఈ విద్యాసంవత్సరంలోనే 13 వేల మంది విద్యార్థుల ప్రవేశం అదనంగా పెరగాలి. డ్రాపవుట్‌లను సహించం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలి. పోలవరంలో గర్భిణి మృతి చెందడం వంటి ఘటనలు పునరావృతం కాకూడదు. అభివృద్ధి పనులు ప్రతిపాదనలు రూపొందించే సమయంలో స్థానిక ఎమ్మె ల్యేల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఆయన అధికారులకు హితబోధ చేశారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర నాథ్, ఎమ్మెల్యేలు సొంగా రోషన్‌కుమార్, పత్సమట్ల ధర్మ రాజు, జేసీ ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్శేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజు, ఆర్డీవోలు అచ్యుత అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు.
పూడిక తీయండి : చింతమనేని ప్రభాకర్
దెందులూరు గోదావరి కాలువకు శివారు ప్రాంతాలైన నియోజకవర్గ పరిధిలో కాలువలు, చెరువుల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత పనులు చేపట్టి పూర్తి చేయాలి. కాలువలు, చెరువులకు మరమ్మతులు చేయాలి.
ఉప్పుటేరు నుంచి రక్షణ కల్పించండి : కామినేని
కైకలూరు నియోజకవర్గంలో ఉప్పుటేరు ముంపునుంచి రైతులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. వాస్తవ పరిస్థితిని గుర్తించి తదనుగుణంగానే తీసుకునే చర్యలుండాలి.
మెరుగైన వైద్యం అందాలి : బడేటి చంటి
ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌక ర్యాలు అందించాల్సిందే. ఈ ఆసుపత్రికి సౌకర్యాల కల్పనతో పాటు, ప్రజలు మెచ్చే వైద్య సేవలు అమలు కావాలి. ఈ దిశగానే చర్యలు తీసుకోండి.
సహకరించండి : మద్దిపాటి వెంకట్రాజు
పశువుల షెడ్ల నిర్మాణంలో రైతులిచ్చే సూచనల వైపు చూడం డి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవే శాలు పెరిగేలా చూడండి. పామాయిల్ కోత సమయంలో విద్యుదాఘాతంతో మరణిం చే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలి.
ఉద్యాన పంటలే లక్ష్యం : కలెక్టర్ వెట్రిసెల్వి
జిల్లాలో ఉద్యానవన పంటల్లో 80 శాతం పామాయిల్, 10 శాతం కోకో, ఇంకో 10 శాతం ఇతర ఉద్యానపంటలు సాగవుతున్నాయి. జిల్లాలో ఈ పంటలను మరింత విస్తరించేలా లక్ష్యంగా పెట్టుకున్నాం.
భూసేకరణ పూర్తి చేయాలి: మంత్రి పార్థసార థి
నూజివీడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులకు భూసేకరణ పూర్తి చేయాలి. ఆగిరిపల్లి పర్యటనలో సీఎం ఇచ్చిన హామీ మేరకు పశువుల షెడ్డును ఏర్పాటు చేయా లి. కామవరపుకోట వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో విద్యా ర్థుల ప్రవేశాలు జరగాల్సిందే. ఇళ్ల నిర్మాణాల్లో పట్టణ ప్రాంతాల్లో అర్హులను గుర్తించి, దరఖాస్తు చేసేలా చూడాలి. మామిడిపై కోడిపేను వైరస్‌తో నష్టపోతున్నారు. రానున్న సీజన్‌కు అయినా దీనిని అరికట్టాలి.
ధాన్యం కొనుగోళ్లలో టాప్ : మంత్రి నాదెండ్ల
ఖరీఫ్, రబీ కాలంలో 12వేల400 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గతంలో కన్నా 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేశామని, రైతులకు 24 గంటల్లో సొమ్ము చేశామన్నారు. జిల్లా సమీక్షా సమావేశం తర్వాత మంత్రి పార్థసారఽథితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లాలో రబీకి సంబంధించి ఇప్పటికే 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేక రణ పూర్తి అయ్యిందన్నారు. ఇప్పటికే రూ.486 కోట్లు రైతు ఖాతాల్లోకి వేశామన్నారు. ఏలూరు జిల్లాను అభివృద్ధి పఽథంలో నిలుపుతామని, ప్రజలతో కలిసి అడుగులు వేస్తామన్నారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు అగ్రతాంబూలం ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో పేరుకుపోయిన సమస్యలను 30 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.
Updated Date - May 20 , 2025 | 12:47 AM