ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహానాడు అదుర్స్‌

ABN, Publish Date - May 29 , 2025 | 12:28 AM

మహానాడులో గురువారం జరిగే బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు సొంత వాహనాల్లో బయల్దేరారు.

మహానాడులో ఉమ్మడి జిల్లా నాయకులు

అప్పగించిన బాధ్యతల్లో మన మంత్రులు, ఎమ్మెల్యేల సక్సెస్‌

చెమటోడ్చిన మంత్రులు, మాజీలు

ప్రతినిధుల సభలో కార్యకర్తల జోష్‌

నేడు బహిరంగ సభ.. తరలిన తమ్ముళ్లు

మహానాడులో గురువారం జరిగే బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు సొంత వాహనాల్లో బయల్దేరారు. గడిచిన రెండు రోజులుగా ప్రతినిధుల సభలో సుమారు మూడున్నర వేలమందికి పైగా ఉమ్మడి పశ్చిమ నుంచి టీడీపీ తీర్మానాల చర్చల్లో పాలు పంచుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి

తెలుగుదేశం కార్యకర్తలు, నేతలంతా మహానాడులో కదం తొక్కారు. ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్‌, మిగతా సీనియర్లను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. మహానాడు విశేషా లను ఎప్పటికప్పుడు తమ నియోజకవర్గ ప్రజలకు చేర వేసేందుకు ప్రయత్నించారు. మంత్రి రామానాయుడు సభా వేదిక పర్యవేక్షణలో క్షణం తీరిక లేకుండా వ్యవహరించి సీఎం చంద్రబాబు ప్రశంసలు పొందిన ట్లు సమాచారం. ఆహార కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తణుకు ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణ చురుగ్గా వ్యవహరించారు. ఎప్పటికప్పు డు అవసరాన్ని గుర్తించి తగు ఏర్పాట్లు చేయగలిగారు. పార్టీ కోశాధికారి మెంటే పార్ధసారథి పార్టీ ఆదాయం, ఖర్చులు వివరించడమే కాకుండా పార్టీ ఆర్థిక వ్యవహా రాల చర్చల్లో పాల్గొన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు పార్కింగ్‌ కమిటీలో చెమటోడ్చి పనిచేశారు.

ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

ఒకవైపు కడపలో మహానాడు అట్టహాసంగా సాగు తుండగా, నియోజకవర్గాల్లో కార్యకర్తలే దగ్గరుండి బుధ వారం ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందుబాటులో లేకపోయినా కార్యకర్తలే చురుగ్గా వ్యవహరించారు. ఏలూరు నగరం తో పాటు మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు కార్యకర్తలు ముందుకొచ్చారు.

Updated Date - May 30 , 2025 | 03:06 PM