కొత్తల్లుడికి 204 రకాలతో విందు
ABN, Publish Date - May 11 , 2025 | 12:34 AM
వివాహం జరిగి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు 204 రకాల పిండి వంటలు రుచి చూపించారు.
ఏలూరు రూరల్, మే 10(ఆంధ్రజ్యోతి): వివాహం జరిగి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు 204 రకాల పిండి వంటలు రుచి చూపించారు. ఏలూరు–చాటపర్రు రోడ్డులోని రాఘవేంద్ర టవర్స్‌పక్కన నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మోతుకూరి చంద్రకుమార్, లీలావతి దంపతుల కుమార్తె మోహిని లక్ష్మీప్రియకు కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందిన లవ కిరణ్‌కి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం జరిపించి ఆరు నెలలు పూర్తి కావడంతో వినూత్నంగా 204 రకాల శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు తదితరులతో ప్రత్యేక విందును ఏర్పాటు చేశా రు. ఈ మెగా విందును చూసి అల్లుడు ఆశ్చర్యపోతూ.. ఈ అపురూప విందును శాకాహారంలో ఎప్పుడూ ఊహించలేదని, ఎప్పటికి మర్చిపోలేనని తెలిపారు.
Updated Date - May 11 , 2025 | 12:34 AM