ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్టీఆర్‌ వైద్యసేవలో డయాలసిస్‌

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:29 AM

ఆకివీడు సీహెచ్‌సీలో డయాలసిస్‌ సెంటర్‌ను రాబోయే పది రోజుల్లోగా ఎన్టీఆర్‌ వైద్యసేవతో అనుసంధానం

స్వామి వివేకానందకు నివాళులర్పిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, కలెక్టర్‌ నాగరాణి, సేవా సమితి ప్రతినిధి శివవర్మ తదితరులు

పది రోజుల్లోగా ఆకివీడు సీహెచ్‌సీలో అందుబాటులోకి.. పట్టణంలో రెండు రైల్వే అండర్‌పాస్‌ల ఏర్పాటు : డిప్యూటీ స్పీకర్‌

ఆకివీడు, జూలై 25(ఆంధ్రజ్యోతి):ఆకివీడు సీహెచ్‌సీలో డయాలసిస్‌ సెంటర్‌ను రాబోయే పది రోజుల్లోగా ఎన్టీఆర్‌ వైద్యసేవతో అనుసంధానం చేయనున్నట్టు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు, కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. సీహెచ్‌సీలో శుక్రవారం ఎక్స్‌రే యూనిట్‌, రక్త నిల్వ విభాగాలను ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అనుసంధానంతో ఆసుపత్రి రెండోషిఫ్ట్‌ పనిచేసేలా చూస్తాం. త్రీ పేస్‌ సమస్యలు తలెత్తకుండా కొత్త జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి, సిమెంట్‌ రోడ్లు వేస్తాం. ఆకివీడులో దాతలకు కరువు లేనందున, వసతులు దానికంతట అవే సమకూరుతాయి. ఆకివీడులో డబ్లింగ్‌ లైన్‌ కారణంగా రైళ్ల రాకపోకలు పెరిగాయి. ఈ కారణంగా తరచూ గేట్లు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రెండు రైల్వే అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు. డీసీహెచ్‌వో సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డాక్టర్‌ భువన, వైద్యులు బిలాల్‌, అచ్యుత్‌ గణేశ్‌, టీడీపీ మండలాధ్యక్షుడు మోటుపల్లి రామవరప్రసాద్‌, అజ్మల్‌, జాకీర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:29 AM