అభివృద్ధే మంత్రం
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:58 AM
కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి నేటికి ఏడాది. స్వల్ప కాల వ్యవధిలోనే నియోజక వర్గాల వారీగా తమను గెలిపించిన ప్రజల ఆశలు, ఆకాం క్షలు తీర్చే దిశగా పలువురు ఎమ్మెల్యేలు వేగంగా ముందుకు సాగారు.
అభివృద్ధిలో పోటీ పడిన ఎమ్మెల్యేలు
కొత్తదనం, మార్పు చూపించే ప్రయత్నం
ఉండిలో రఘురామ సరికొత్త ప్రయోగం
పాలకొల్లులో మంత్రి నిమ్మల రూటే సెపరేటు
నూజివీడులో మంత్రి కొలుసు సరికొత్త ఒరవడి
వివాదాలు పక్కనపెట్టి సంక్షేమం వైపు చకచకా
ప్రజలు కోరుకున్న ‘మార్కు’ చూపించారు
కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి నేటికి ఏడాది. స్వల్ప కాల వ్యవధిలోనే నియోజక వర్గాల వారీగా తమను గెలిపించిన ప్రజల ఆశలు, ఆకాం క్షలు తీర్చే దిశగా పలువురు ఎమ్మెల్యేలు వేగంగా ముందుకు సాగారు. జనం మెచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సరికొత్త అభివృద్ధికి నాంది పలికారు. తమ నియో జకవర్గం మిగతా వాటికంటే ముందుండాలన్న లక్ష్యంతో సరికొత్త పోటీ వాతావరణంతో ముంద డుగులు వేస్తున్నారు.
– ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి
ఏలూరు ధగధగ
ఈ ఏడాది కూటమి పాలనలో ఏలూరు జిల్లాలో ఎవరూ ఊహించని రీతిలో ఎమ్మెల్యేల చొరవ, రాష్ట్ర ప్రభుత్వ పర్య వేక్షణ కుదిరి అతి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. విద్యా రంగంలో ఏలూరు సమీపాన అంబేడ్కర్ వర్సిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అందరిలో సంతోషాన్ని మిగిల్చింది. చింతలపూడి వద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభు త్వం ఆమోదముద్ర వేసిన రోజుల వ్యవధిలోనే పునాది రాయి పడింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగులకు ఉపాధి దొరకబోతుంది. ఆగిరిపల్లి మండలంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 1500 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంట్ రాక వెనుక సమాచార శాఖ మంత్రి పార్థసారఽథి కృషి ఉంది. పోలీస్ అకాడమి కోసం మరో 55 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలోని కొంత భూమిని ఆక్టోపస్ శిక్షణ కేంద్రానికి, పోలీస్ శిక్షణ కేంద్రానికి ఇచ్చే దిశగా ప్రయత్నాలు సాగాయి. దెందులూరు నియోజక వర్గంలో చింతమనేని ప్రభాకర్ పోలవరం కుడి కాలువ దగ్గర నుంచి సీతంపేట ఛానల్ వరకు అన్ని పనులను ఆయనే దగ్గరుండి పర్యవేక్షిం చారు. నియోజకవర్గమంతా సిమెంటు రోడ్ల నిర్మాణంతో ఇప్పుడు సులభంగా వాహనాలు తిరిగేలా చేశారు. కొల్లేరు సమస్యలపై సీఎంతో జరిగిన సమావేశాల్లోను పాల్గొన్నారు. చింతలపూడి నియోజక వర్గంలో ఎర్రకాలువ నుంచి తాగునీరు జంగారెడ్డి గూడేంకు చేర్చేందుకు ఎమ్మెల్యే రోషన్ కృషి నెరవేరింది. ఏలూరు శని వారపుపేట వైపు వెళ్లే తమ్మిలేరుపై కాజ్‌వే తొలగించి బ్రిడ్జి నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారు. నగర రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి కార్యచరణకు దిగారు. కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో రోడ్లతోపాటు ఇతర అభి వృద్ధి పనులతో పాటు కొల్లేరుకు ఒక కళ రప్పించేలా ఎమ్మె ల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు కృషి దాగి ఉంది.
పశ్చిమలో మరో ప్రస్థానం
పాలకొల్లు నియోజకవర్గంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తనదైన శైలిలో అభివృద్ధికి ప్రయ త్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రోడ్లతోపాటు పెండింగ్ పనుల పూర్తికి సానుకూలత వ్యక్తమైంది. యలమంచిలి మండలంలో గోదావరి ఏటి గట్ల పటిష్టతకు నిధులు విడు దలై పనులు సాగడానికి మార్గం ఏర్పడింది. పాలకొల్లు పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించుకు న్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘు రామకృష్ణరాజు ఈ ఏడాది కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండిలో కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించడమే కాకుం డా అన్ని కాలువలు, మురుగు కాలువల ప్రక్షాళనకు సాహ సించారు. పోలీస్‌స్టేషన్ల భవనాల నిర్మాణం, వాహనాలు సమ కూర్చడమే కాకుండా నియోజక వర్గంలో ప్రశాంత వాతావరణం నెల కొనేలా సీసీ కెమె రాలు ఏర్పాటు చేశారు. నరసాపురం నియోజక వర్గంలోను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఏడు కోట్లతో కొత్త రో డ్లు వేశారు. తాగునీటి పంపిణీ సక్రమంగా సాగేలా ఫిల్టర్ బెడ్‌లకు నాంది పలికారు. ఆక్వా యూనివర్సిటీ, హార్బ ర్, వశిష్ఠ వారధి ఎమ్మెల్యే ఆశించినట్టుగా ముందు కు సాగలేదు. తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పట్టణంలో మూలనపడిన పార్కుకు జీవం పోశారు.సీఎంను ఒప్పించి రూ.50 కోట్లు నిధులు రాబట్టారు. రోడ్లను అద్దంలా తీర్చిదిద్దేం దుకు రూ.20 కోట్లు రాబ
ట్టడమే కాకుండా ఆ మేరకు పనులు చేయించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో అభివృద్ధికి కోట్ల రూపాయలు వచ్చేలా చూశారు. ఒక్క రైల్వే పనులకే రూ.300 కోట్లు, మినీ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేసేం దుకు స్వయంగా కృషి చేయడం అందరి మన్ననలకు దారితీసింది. ఆచంట నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ముందుగా తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగానే తదుపరి నిర్ణయాలు తీసుకోవడంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించారు. భీమవరం నియోజకవర్గంలో డంపింగ్ యార్డు, బైపాస్ వంటి కీలక సమస్యలను పరిష్కరించ డానికి ఎమ్మెల్యే అంజిబాబు సర్వశక్తులు ఒడ్డారు.
గళం వినిపించడంలో ఘటికులు
నరసాపురం లోక్‌సభ స్థానంలో ఉన్న సమస్యలే కాకుండా ఉక్కు సహాయ మంత్రి హోదాలో భూపతిరాజు శ్రీనివాసవర్మ మెరుగైన పాత్ర పోషించారు. తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టినా తడబాటు లేకుండా నిలిచారు. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం వివాద పరిష్కారంలో కీలకంగా వ్యవహరిం చడమే కాకుండా రాష్ట్రస్థాయిలో తగినంత అనుకూలత సాధించగలిగారు. నర్సాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఆక్వా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. నర్సాపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదలలో చురుగ్గా వ్యవహరించారు. ప్రత్తిపాడు–నవాబ్‌పాలెం–ఆరుళ్ల మార్గంలో రైల్వే వంతెన నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించేలా చేశారు. ఆకివీడు–దిగమర్రు నాలుగులైన్ల రహదారి అభివృద్ధికి కీలక భూమిక పోషించారు. లోసరి–పిప్పర జాతీయ రహదారి అనుసంధానానికి వంద కోట్లు మంజూరు చేయించారు. కిడ్నీ బాధితులను ఆదుకునేలా తన పార్లమెంట్‌స్థానం పరిధిలో ఏడు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు.
ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో అనేక సమస్యలపై పార్లమెంట్‌లో ఈ ఏడాది గళం వినిపించింది. రైతులు, రైల్వే, కొల్లేరు వంటి కీలక సమస్యల ప్రస్తావనలో ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ చొరవ చూపించారు. ఏడాదిలో ఆయన కేంద్రంలో అనేకమంది మంత్రులతో భేటీ అయ్యారు. భద్రాచలం–కొవ్వూరు రైల్వేలైన్‌కు క్లియరెన్స్ లభించేలా చేయగలిగారు. నియోజక వర్గ పరిధిలో రైల్వే స్టేషన్లలో వసతు ల కల్పనకు కృషి చేశారు. పామాయిల్, కోకో రైతుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కొల్లేరు సమస్య అత్యంత సున్నితమైందీ కాగా, సరస్సు పరివా హకంలో సాధారణ ప్రజలు జీవించేలా వారికి అవకా శాలు మెరుగుపర్చాలని పార్లమెంట్ దృష్టికి తీసుకువ చ్చారు. కొల్లేరు, రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రులను కలిసి చర్చించారు. ఈ ఒక్క ఏడాదిలో ఎంపీగా పుట్టాకు మంచి మార్కులే లభించాయి.
Updated Date - Jun 12 , 2025 | 12:58 AM