ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగుకు సాయం

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:36 AM

వ్యవసాయంలో కూలీల నుంచి విత్తనాల వరకు అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి. బ్యాంకులు అందించే రుణాలు మాత్రం తక్కువ.

సార్వా నుంచి పంటలకు రుణ పరిమితి పెంపు

డీసీసీబీ ద్వారా రూ.2500 కోట్లు రుణాలందించాలని లక్ష్యం

ఆప్కాబ్‌ నుంచి కూడా రైతులకు రుణమందించే యోచన

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

వ్యవసాయంలో కూలీల నుంచి విత్తనాల వరకు అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి. బ్యాంకులు అందించే రుణాలు మాత్రం తక్కువ. రైతన్నలు వ్యవసాయ పెట్టుబడికి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి బ్యాంకులు, సహకార సంఘాలు రైతులకు రుణ పరిమితిని పెంచాయి. ప్రభుత్వం కూడా ముందస్తు సార్వాకు సన్నద్ధం చేయనుండటంతో రైతులకు ఆ మేరకు పరపతిని కల్పించనున్నారు.

రైతులు ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమయ్యారు. ప్రభుత్వం ఇటీవల రుణ పరిమితిని పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో ఖరీఫ్‌ సీజన్‌లో రూ.2500 కోట్ల సత్వర పంట రుణాలను ఇవ్వాలని డీసీసీబీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో డీసీసీబీ 34 శాఖల పరిధిలో 258 సొసైటీల కింద రుణాలను రెండు పంటల కాలాలకు రైతులకు రుణాలు సమకూర్చేది. ఈ సంస్థను ఆర్థిక నష్టాలను వెంటాడుతున్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఇటీవల పెంచిన పెట్టుబడి సాయం పరి మితికి లోబడి రూ.2500 కోట్లు రుణాలను ఇచ్చి తీరాలని ఇటీవల లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఉమ్మడి పశ్చిమలో ఏటా మొత్తం 5,90,598 మంది పంట రుణాలను పొందుతున్నట్లు సమాచారం. ప్రతీ సొసైటీలో గతంలో ఇచ్చిన రుణం కంటే ఈసారి 15 శాతం అదనంగా రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రైతులకు సగటున పంటల వారీగా రూ.9 వేల నుంచి రూ.17వేల వరకు రుణ పరిమితి పెంచారు. వరి, మొక్కజొన్న, ఇతర పంటలకు సాయం విస్తరించే యోచనలో ఉన్నారు. ప్రతీ సొసైటీలో రైతులకు సత్వరం అడిగిన వారి రుణం అందివ్వడానికి సర్వ సన్నద్ధంగా ఉన్నారు.

ఆప్కాబ్‌ నుంచి రూ.300 కోట్ల రుణం :

పి.సింహాచలం, డీసీసీబీ సీఈవో

రైతులను, సొసైటీలను బలోపేతం చేయడానికి ఆప్కాబ్‌ నుంచి డీసీసీబీకి రూ.300 కోట్ల ఆర్థిక సాయం అందివ్వాలని కోరాం. త్వరలో విడుదల అవుతాయని భావి స్తున్నాం. ఆ నిధులు రాగానే ఈ సార్వా నుంచే పామాయిల్‌, ఆక్వా సాగుకు ఏరియాల వారీగా సొసైటీల్లో రుణాలను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో అనుబంధ రంగాలకు రుణాలను విస్తరణ చేస్తాం. ఇదే సందర్భంలో మొండిబకాయిలు వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Jul 08 , 2025 | 12:36 AM