ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంటల బీమాకు దరఖాస్తులు అంతంతే!

ABN, Publish Date - Jul 27 , 2025 | 11:50 PM

ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్న సమయంలో పంటల బీమా పథకంలో బీమా చెల్లించిన వారికి ఆర్థికంగా భరోసా లభిస్తుంది.

పంటల బీమాకు

దరఖాస్తులు అంతంతే!

వరికి ఆగస్టు 15 వరకు, మినుము పంటకు

ఈ నెలాఖరు వరకు అవకాశం

పత్తి ,నిమ్మ పంటలకు ఇప్పటికే ముగిసిన గడువు

జిల్లా వ్యాప్తంగా అందిన 611 దరఖాస్తులు

రైతుల్లో కానరాని స్పందన

ఏలూరుసిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి):ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్న సమయంలో పంటల బీమా పథకంలో బీమా చెల్లించిన వారికి ఆర్థికంగా భరోసా లభిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకానికి గడువు ముగుస్తున్నా అంతంత మాత్రంగానే దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలను పరిశీలిస్తే ఇప్పటివరకు 186.6 హెక్టార్లకు సంబంధించి 611 దరఖా స్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో రుణాలు పొందిన వారు 176 మంది, రుణాలు పొందని వారు 435 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే మండలాల్లో వ్యవసాయ శాఖాధికారులు రైతుల్లో అవగాహన కల్పించారు. అయినా రైతుల్లో అంతంత మాత్రంగానే స్పందన కనిపి స్తోంది.

జిల్లాలో సార్వా 2025 వరి పంటకు గ్రామ యూనిట్‌గా, మినుము పంటకు జిల్లా యూనిట్‌గా, పత్తి, నిమ్మ పంటలకు గ్రామం యూనిట్‌గా అమలు చేస్తున్నారు. బ్యాంకులో రుణం పొందే రైతులు, రుణాలు పొందని రైతులు, సొంత భూమి, కౌలుదారులు, రుణ అర్హత గుర్తింపు కార్డు కలిగిన రైతులు అర్హులుగా పేర్కొన్నారు. వరి పంటకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద రూ.840 రైతు ప్రీమియం కాగా ఆగస్టు 15వ తేదీ నమోదుకు చివరి తేదీ. మినుము పంటకు రూ.300 రైతు ప్రీమియం కాగా నమోదు చేసుకోవడానికి జూలై 31 చివరి తేదీగా ప్రకటించారు. పత్తి పంటకు ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ (వాతావరణ ఆధారిత పంటల బీమా) కింద రూ.1900 రైతు ప్రీమియం కాగా జూలై 15వ తేదీ తుది గడువుగా పేర్కొన్నారు. నిమ్మ పంట కు ఆర్‌డబ్ల్యూబీసీ ఇన్సూరెన్స్‌ స్కీం కింద రూ.2500 రైతు ప్రీమియంగా, నమోదుకు జూలై 15వ తేదీ తుది గడువుగా పేర్కొన్నారు. దరఖాస్తు పారం పూర్తి చేసి ఆధార్‌ నకలు, బ్యాంకు ఖాతా వివరాలు, బ్యాంకు పాస్‌బుక్‌ నకలు, కౌలు రైతులు తప్పనిసరిగా సీసీఆర్‌సీ కార్డు నకలు, రుణం తీసుకొనని సొంత రైతులు తప్పనిసరిగా పట్టాదార్‌ పాస్‌పుస్తకం నకలు, పంట ధ్రువీకరణ పత్రం జతపరచాలి. రుణం పొందిన రైతులకు బ్యాంకు ప్రతినిధులు ప్రీమియం తగ్గించి రుణం మంజూరు చేస్తారు. రుణం పొందని రైతుల పథకంలో నమోదు చేయడానికి అవసరమైన పత్రాలు తీసుకుని సమీపంలో ఉన్న కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (మీసేవా కేంద్రం), పోస్టాఫీసు,గ్రామ సచివాలయంలో సంప్రదించి గడువు తేదీలోగా ప్రీమియం నగదు చెల్లించి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు సమీపంలో ఉన్న బ్యాంకు శాఖ, సం బంధిత వ్యవసాయ శాఖాధికారిని, సంబంధిత బీమా కంపెనీల ప్రతినిధులను సంప్రదించవచ్చు.

జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు 611

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, ఆర్‌డబ్ల్యూ బీసీఐఎస్‌ పథకాలకు సంబంధించి మొత్తం 611 దర ఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనకు సంబం ధించి 594, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌కు సంబంధించి 17 దర ాస్తులు వచ్చాయి. పత్తి, నిమ్మ పంటలకు సంబంధించి ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ పథకానికి ఈనెల 15వ తేదీతో గడువు ముగిసింది. ఈ పథకానికి సంబంధించి కుక్కునూరు, కామ వరపుకోట, ద్వారకా తిరుమల, ఆగిరిపల్లి మండలాల్లో 4 ఇన్సూరెన్స్‌ యూని ట్లుకు సంబంధించి ఐదుగురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు.

ఫ ఇక ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనకు సంబం ధించి వరి పంటకు ఆగస్టు 15వ తేదీ వరకు, మినుము పంటకు సంబంధించి ఈనెలాఖరు వరకు తుది గడువు ఉంది. వరి, మినుము పంటలకు సంబంధించి జిల్లాలోని మండవల్లి, ఆగిరిపల్లి, ముదినేపల్లి, ఉంగుటూరు, ఏలూరు, చాట్రాయి, భీమడోలు, దెందులూరు, కొయ్యలగూడెం, లింగ పాలెం, జంగారెడ్డిగూడెం, పెదపాడు, నూజివీడు, నిడమర్రు, ముసునూరు, బుట్టాయిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, టి.నర్సాపురం, పెదవేగి, కలిదిండి, పోలవరం, జీలుగుమిల్లి మండలాలకు సంబంధించి 164 ఇన్సూరెన్స్‌ యూనిట్లు కాగా మొత్తం 435 మంది ఽరైతులు దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:50 PM