ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాగివైర్ల దొంగల జోరు

ABN, Publish Date - Aug 03 , 2025 | 11:52 PM

మండలం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ బోర్లకు సంబంధిం చిన సామగ్రిలో రాగివైర్లు చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి.

వేల్పుచర్లలో వ్యవసాయ బోరు వద్ద కేబుల్‌ కట్‌ చేసిన దృశ్యం

పొలాల్లో సామగ్రి అపహరణ..

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగని చోరీలు.. బాధిత రైతుల ఆవేదన

ముసునూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ బోర్లకు సంబంధిం చిన సామగ్రిలో రాగివైర్లు చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి సమయాల్లో కేబుల్‌ వైర్‌, స్టార్టర్‌, ఫ్యూజుల్లోని రాగివైరును దుండగులు చోరీ చేస్తుం డడంతో ప్రతి రైతు రూ.10వేలు నుంచి రూ.15వేలు వరకు నష్టపోతున్నాడు. తాజాగా వేల్పుచర్లలో నలు గురు రైతుల వ్యవసాయ బోర్ల నుంచి కేబుల్‌, ఇతర సామగ్రిలో రాగివైర్లను దొంగిలించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని, ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధిత రైతు లు తెలిపారు. నెలల వ్యవధిలోనే ముసునూరు, గోప వరం, రమణక్కపేట, కొర్లకుంట, పెద్దపాటివారి గూడెం, తాళ్ళవల్లి, చెక్కపల్లి తదితర గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 20 నుంచి 30 బోర్ల సామగ్రి చోరీ అయ్యాయి. ఇటీవల పంటపొలాల్లో బిందు సేద్యానికి సంబంధించిన సామగ్రి సైతం చోరీకి గురవుతు న్నాయి. ఒకవైపు బోర్లు సామగ్రి, మరొకవైపు డ్రిప్‌ పరికరాలు చోరీకి గురికావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. అరకొరగా పండుతున్న పంటలతో ఇబ్బందులు పడుతుండగా, కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ చోరీలతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగలను పట్టుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ చోరీలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:52 PM