డ్రగ్స్ మనకొద్దు ఆరోగ్యమే ముద్దు
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:39 AM
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా గురువారం భీమవరం అంబేద్కర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
భీమవరం క్రైం, జూన్ 26(ఆంధ్రజ్యోతి):మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా గురువారం భీమవరం అంబేద్కర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు, పోలీసు అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని డ్రగ్స్ మనకొద్దు.. ఆరోగ్యమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ యువత భవిష్యత్‌ను నాశనం చేయడమే కాకుండా సమాజంలో నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయని అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువత డ్రగ్స్ ఉచ్చులో పడకుండా వారిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ ఆర్.జయసూర్య, ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 12:39 AM