ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తడి, పొడి చెత్తను ఇంటి నుంచే వేరుచేయాలి

ABN, Publish Date - Apr 20 , 2025 | 01:05 AM

తడి, పొడి చెత్తను ఇంటి నుంచే వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ నాగరాణి సూచించారు.

తాడేపల్లిగూడెం ‘స్వచ్ఛాంధ్ర’లో పశ్చిమ జిల్లా కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి

తాడేపల్లిగూడెం అర్బన్‌/కాళ్ల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): తడి, పొడి చెత్తను ఇంటి నుంచే వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ నాగరాణి సూచించారు. ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర’ కార్యక్ర మంలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణం నాలుగో వార్డులోని అమ్మ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ–వేస్ట్‌ అవగాహన, 14వ వార్డు బీఆర్‌ మార్కెట్‌లో తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చే ప్రక్రియ పరిశీలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త నియంత్రణ, నిర్మూలనతో మన ఆరో గ్యాలను మనమే కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజలం దరూ కలిసి విజయవంతం చేయాలన్నారు. ఏమైనా పాడైన ఎలక్ర్టానిక్‌ పరికరాలు ఉంటే వాటిని పట్టణ మునిసిపల్‌ కేంద్రాలలో, మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన కేం ద్రాలలో అందజేయాలన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బీఆర్‌ మార్కె ట్‌లో కంపోస్ట్‌ యూనిట్‌ను వారు సంయుక్తంగా ప్రారంభించారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఏసుదాసు, తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, గొర్రెల శ్రీధర్‌, వర్తనపల్లి కాశి, పుల్లా బాబ్జి, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెద అమిరంలో..

కాళ్ల మండలం పెదఅమిరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ–వేస్ట్‌ కలెక్షన్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ నాగరాణి సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మానవాళికి ఎంతోనష్టం చేకూర్చే ఈ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నారా ?.. ఆ చెత్తను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొంతమంది గృహస్థులు వేరుచేసి ఇవ్వడం లేదని, చెత్తను సంపద కేంద్రానికి తరలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు, స్థానిక ప్రజలు అందజేసిన ఈ– వేస్ట్‌ను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో డీపీవో బి.అరుణశ్రీ, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, గ్రామ సర్పంచ్‌ డొక్కు సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం : ఎస్పీ

భీమవరం క్రైం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి) : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీని పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఆయన సిబ్బందితో కలిసి స్వయంగా చెత్త, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. గునపం, పార చేతబట్టి పిచ్చిమొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల చాలావరకు అనారోగ్యాలను మన దరిచేరకుండా చేసుకోవచ్చన్నారు. వాతావరణ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, గుడ్డ సంచులు వాడాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, జిల్లా స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 01:05 AM