ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చండి

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:31 AM

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికపై దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై ఇంటింటి ప్రచారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ చదలవాడ నాగ రాణి అధికారులను ఆదేశించారు.

అధికారులతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగరాణి

విద్యాశాఖ అధికారులకు కలెక్టర్‌ నాగరాణి సూచన

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికపై దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై ఇంటింటి ప్రచారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ చదలవాడ నాగ రాణి అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టర్‌ సమీక్షించారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులు, అన్ని మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసుకుని మండల ప్రత్యేకాధి కారి, ఎంఈవో, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఈవో ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016 అనుబంధం మార్గదర్శకాలు– 2023 అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నాగరాణి నిర్వహించారు.

నిర్ధేశిత లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి

నిర్దేశిత లక్షాల సాధనకు అధికారులు మరింత కృషి చేయాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు, మునిసిప ల్‌ కమిషనర్లతో వర్క్‌ ఫ్రంహోం, ఈకేవైసీ, ఆధార్‌ నమోదు, మన మిత్ర అంశాలపై గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డీపీవో బి.అరుణశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:31 AM