నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:52 AM
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
బుట్టాయగూడెం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బుట్టాయగూడెం మండలంలో మంగళ వారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పా ల్గొన్నారు. రూ.65 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయినేజి పనులను ప్రారంభించారు. రెడ్డిగణప వరం పంచాయతీ పల్లపూరు నిర్వాసిత కాలనీ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 35 వేల మంది నిర్వాసితులను బయట ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నా రు. నిర్వాసితులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకా లు అందజేస్తామని, భూమిని ఇవ్వడం జరుగు తుందన్నారు. అర్హులైన పేదలకు త్వరలో కార్డు లు మంజూరు చేస్తామని తెలిపారు. ఏజెన్సీలో రోడ్లు, డ్రెయిన్లు మరమ్మతులకు, నిర్మాణాలకు రూ.27 కోట్లు ఇవ్వడం జరిగిందని మరో రూ.20 కోట్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కల్యాణ్ సుముఖంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం సత్యసాయి మంచినీటి పథకాన్ని ని ర్వీర్యం చేసిందని, కనీసం కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేదని, పథకం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్టీ నిర్వాసితుల కు అంత్యోదయ అన్న యోజన కార్డులను ఇచ్చి నెలకు 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామ న్నారు. ముందుగా 798 మందికి కార్డులు మం జూరుచేసి బియ్యాన్ని ఇస్తున్నట్లు మంత్రి తెలి పారు. నిర్వాసితుల కాలనీల్లో మౌలిక సదుపా యాలను కల్పిస్తామన్నారు. పీ4తో పేదల జీవితాల్లో మార్పులు వస్తాయని అందుకు అందరూ సహకరించాలని సూచించారు. చిన్న పరిశ్రమలు స్థాపనతో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్య త్‌లో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తామ న్నారు. రాష్ట్రంలో మన జిల్లా అభివృద్ధి అంశాల్లో 5వ స్థానంలో ఉందని మూడో స్థానం కోసం కృషి చేయాలని తెలిపారు. నిర్వాసితులు కాలనీ ల్లో మౌలిక సదుపాయాలు లేవని, ఉపాధి లేదని, శ్మశాన వాటిక లేదని, పూర్తిస్థాయి పరిహారం అందించాలని అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రిని తెలపగా చర్యలు తీసుకుంటామన్నారు.
జీలుగుమిల్లి: మండలంలో రౌతుగూడెం, ఎర్రవరం నిర్వాసిత కాలనీల్లో గిరిజనుల సమ స్యల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలు సుకున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుం డా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో రాము లు నాయక్‌ను ఆదేశించారు. నిర్వాసితుల ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి అంకన్నగూడెం, తాటియాకులగూ డెం, జీలుగుమిల్లికి చెందిన పలువురు పార్టీలో చేశారు. కటుకూరు నిర్వాసిత కాలనీలో వేలేరు పాడు మండల వాసులు ఎమ్మెల్యే చిర్రి బాలరా జుతో కలసి మంత్రికి శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో పౌర సరఫరాలశాఖ కమిషనర్ సౌరవ్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి, ఆర్డీవో రమణ, ఐటీ డీఏ పీవో రాములు నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, జనసే పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికల పూడి గోవిందరావు, ఘంటా మురళి, గడ్డమణు గు రవికుమార్, కరాటం సాయి, పసుపులేటి రాము, సుంకవల్లి సాయి, ములిశెట్టి యుగంధర్, తహసీల్దార్ ఉదయ్‌భాస్కర్, సీఐ ఎస్సైలు వెంక టేశ్వరావు, నవీన్‌కుమార్, మేకా ఈశ్వరయ్య, కరాటం సాయిబాబా, కరాటం ఉమామహేశ్వర రావు, అధికారులు, నాయకులు, పాల్గొన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 12:52 AM