ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వే ఉద్యోగాల పేరుతో టోకరా!

ABN, Publish Date - Jul 27 , 2025 | 12:48 AM

రైల్వే ఉద్యోగం కావాలా రూ.15 లక్షలు చేతిలో పెడితే మూడు నెలల్లో పోస్టింగ్‌.. ఇది ఘరానా మోసగాళ్ల వల.

కోట్లలో కొల్లగొట్టిన కేటుగాళ్లు

ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులే లక్ష్యం

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): రైల్వే ఉద్యోగం కావాలా రూ.15 లక్షలు చేతిలో పెడితే మూడు నెలల్లో పోస్టింగ్‌.. ఇది ఘరానా మోసగాళ్ల వల. పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లో ప్రైవేటు బ్యాంకు ల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, ఇతర వ్యాపారులు లక్ష్యంగా ఇద్దరు కేటుగాళ్లు టోకరా వేశారు. తాడేపలి ్లగూడెం, తణుకు ప్రాంతాల్లో పది మంది దగ్గర రూ.2కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఎన్ని నెలలైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు మోసపోయామని గుర్తించి పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు.

తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో ఘరానా మోసగాళ్ల మాటలు విని లక్షల్లో ముట్టచెప్పి ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూసిన వారు ఒక్కొక్కరు గా బయటకు వస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం లోని ఓ గ్రామంలో ఒక కుటుంబంకు చెందిన వారు రూ.30వేల వరకూ ఉద్యోగం కోసం ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటితోపాటు తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో కొందరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఉన్నారు.

ప్రైవేటు ఉద్యోగులకు ఎర..

ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగం చేస్తూ మంచిగా ఉన్న ఉద్యోగులకు ఈ ముఠా బ్యాంకు ఖాతా పేరుతో పరిచయం పెంచుకుంటుంది. వారికి ఉద్యోగం కోసం సొమ్ములు వేస్తున్నామంటూ మాటలు కలిపి ఆ తరువాత ఉద్యోగం ఇప్పిస్తున్నామనే భరోసా అందించి వారిని ముగ్గులో దింపుతారు. ఉంగుటూరు మండలంలోని ఒక వ్యక్తి విశాఖపట్టణంకు చెందిన మరో వ్యక్తి బాదితుల వద్ద లక్షల్లో సొమ్ములు తీసుకున్నట్టు తెలుస్తోంది..

పదుల సంఖ్యలో బాధితులు..

మోసగాళ్ల వలలో చిక్కుకున్నవారు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఒక్కొక్కరు రూ.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ చెల్లించినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖలో టీసీ, తదితర పోస్టుల ఇప్పిస్తామని మాయ గాళ్లు మోసం చేశారు. సొమ్ములు పట్టుకెళ్లిన వారిపై పోలీసులకు ఫిర్యాలు చేస్తున్న బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు లెక్కకు వచ్చి న వారిని బట్టి చూస్తే వారు దోచుకున్న సొమ్ము రూ. 2కోట్ల పైమాటే అన్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jul 27 , 2025 | 12:49 AM