కడకట్ల గురుకుల పాఠశాల జాతికి అంకితం
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:22 AM
తాడేపల్లిగూడెంలోని కడకట్ల గురుకుల పాఠశాలను ఉత్తమ పాఠశాలగా గుర్తించడమే కాకుండా ఆ పాఠశాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా జాతికి అంకితం చేశారు.
వీసీ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
తాడేపల్లిగూడెం రూరల్,జూలై29(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలోని కడకట్ల గురుకుల పాఠశాలను ఉత్తమ పాఠశాలగా గుర్తించడమే కాకుండా ఆ పాఠశాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా జాతికి అంకితం చేశారు. జిల్లాలోని 26 పీఎంశ్రీ పాఠశాలల్లో ఉత్తమ పాఠశాలగా ఎంపికైన గురుకుల పాఠశాలను జాతీయ విద్యావిధానం జాతీయ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వీసీ సమావేశంలో ఆయనతో పాటు సహాయ మంత్రి డాక్టర్ సుఖావత్ మజుందార్, జయంత్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాఠశాల నిర్వహణ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడంపై ప్రిన్సిపాల్ బి.రాజారావు, ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ శ్యాంసుందర్, ఏఎంవో సుబహ్మ్రణ్యం, ఎంఈవో వి.హనుమ, పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:22 AM