ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వసతి గృహాలపై నిఘా..

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:58 AM

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 35 బీసీ, 56 ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 8 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వారందరి రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోంది.

ఏలూరు రూరల్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు భద్రత పెంచేందు కు అనుగుణంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీసీ కెమెరాల ఏర్పాటు గాలికి వదిలేసింది. హాస్టళ్లలోకి ఎవరు వస్తున్నారో.. వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వసతి గృహాలపై నిఘా పెట్టేందుకు వీలుంటుంది. విద్యార్థుల భద్రత మరింత సులభతరం అవుతుంది. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలను అమర్చాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

మౌలిక సదుపాయాలపై దృష్టి

మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం అధికారులలను ఆదేశించింది. ఇప్పటికే సెక్యూరిటీ గార్డులను నియమించింది. ఉపాధి హామీ పథకం కింద ప్రహరీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే చాలాచోట్ల రక్షణ గోడల నిర్మాణం పూర్తయింది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వసతి గృహాల్లో విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాస్మెటిక్స్‌ను జీసీసీ ద్వారా అదనంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. మెనూ చార్జీలు పెంచింది. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.1400 ఆపై తరగతుల చదువుతున్న వారికి రూ.1,600 చొప్పున మెనూ చార్జీలను ప్రభుత్వం చెల్లించనుంది. విద్యార్ధులకు ప్రతీనెలా క్షవరం చార్జీల కింద రూ.50 చెల్లించనుంది. ప్రస్తుతం జిల్లాలోని 56 ఎస్సీ హాస్టళ్లలో ఒక్కొక్క హాస్టల్‌ లో ఎనిమిది చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. బీసీ వసతి గృహాల్లో సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఖర్చు వివరాలు అందజేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 14 , 2025 | 12:58 AM