ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూడు గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:30 AM

జిల్లా ఎస్పీ ఆదేశాలతో సారా తయారీ, అమ్మకాలు జరిగే నాగిరెడ్డిగూడెం, తలార్లపల్లి, ప్రగడవరం గ్రామాల్లో శుక్రవారం ఉదయం పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ జరిపారు.

నాగిరెడ్డిగూడెంలో కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్న ఎక్సైజ్‌, పోలీస్‌ అధికారులు

చింతలపూడి, జూలై 4(ఆంధ్రజ్యోతి):జిల్లా ఎస్పీ ఆదేశాలతో సారా తయారీ, అమ్మకాలు జరిగే నాగిరెడ్డిగూడెం, తలార్లపల్లి, ప్రగడవరం గ్రామాల్లో శుక్రవారం ఉదయం పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ జరిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆవులయ్య గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. సారా తయారీ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎక్సైజ్‌ అధికారులు పాండురంగారావు, సీఐలు ధనరాజ్‌, బి.సత్యనారాయణ, జంగా రెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సీఐ క్రాంతికుమార్‌, ఎస్‌ఐ సతీష్‌కుమార్‌, జిల్లాలోని అన్ని స్టేషన్ల నుంచి సీఐలు, ఎస్‌ఐలు వందమంది సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్‌ సీఐ పి.అశోక్‌ తెలిపారు.

Updated Date - Jul 05 , 2025 | 12:30 AM